ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మృతి చెందిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ పట్ల ఇండియాలో కూడా సానుభూతి వ్యక్తమవుతోంది. ఖమేనీ మృతి చెందిన క్రమంలో దేశవ్యాప్తంగా ముస్లింలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాద్ లోని మౌలాలి దగ్గర ఉద్రిక్తత నెలకొంది... మౌలాలి కమాన్ దగ్గర ఖమేనీ ఫ్లెక్సీ కలకలం రేపింది. కమాన్ కు ఉన్న ఖమేనీ ఫ్లెక్సీని చింపేయడంతో స్థానికులకు యువకులకు మధ్య ఘర్షణ జరిగింది.
ఫ్లెక్సీ చించేసి యువకులపై దాడి చేశారు స్థానికులు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా... ఖమేనీ మృతిపై హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలో కూడా నిరసనలు వెల్లువెత్తాయి. ఓల్డ్ సిటిలోని పురాని హవేలీలో తంజీమ్ ఈ జాఫెరీ సంస్థ నిరసన కార్యక్రమం చేపట్టింది.
ఇజ్రాయెల్ ముర్దాబాద్, నేతన్యాహు మూర్దాబాద్ అంటూ నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు ముస్లింలు. భారీ సంఖ్యలో ముస్లిం మత పెద్దలు.. స్థానికులు ఈ నిరసనలో పాల్గొన్నారు.
ఇజ్రాయెల్ ముర్దాబాద్, నేతన్యాహు మూర్దాబాద్ అంటూ నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు ముస్లింలు. భారీ సంఖ్యలో ముస్లిం మత పెద్దలు.. స్థానికులు ఈ నిరసనలో పాల్గొన్నారు.