అంతర్జాతీయ ప్రమాణాలతో నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్: నాంపల్లి రైల్వే స్టేషన్‌ను 2027 చివరికల్లా అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఎయిర్‌పోర్ట్ తరహాలో ఆధునిక హంగుల్నీ కల్పిస్తామని వెల్లడించారు. నాంపల్లి రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులపై అధికారులతో ఆయన సమీక్షించారు. తొలి దశలో రూ.327 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, దశల వారీగా స్టేషన్ రూపు రేఖలే మారుస్తామని స్పష్టం చేశారు. నాంపల్లి రైల్వేస్టేషన్ నుంచి మెట్రో స్టేషన్‌కు స్కై వాక్ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.