Shiv Pratap Shukla: 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. తెలంగాణ గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ విశేషాలివే
Telangana Governor |తెలంగాణకు కొత్త గవర్నర్‌గా శివ్‌ప్రతాప్ శుక్లా నియమితులయ్యారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ తెలంగాణకు బదిలీ అయ్యారు. మొత్తం 9 రాష్ట్రాలకు కేంద్రం గవర్నర్లను నియమించింది.
న్యూఢిల్లీ/ హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా తెలంగాణ గవర్నర్‌గా ఉన్న జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్రకు బదిలీ కాగా, ఆయన స్థానంలో హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా తెలంగాణ గవర్నర్‌గా బదిలీ అయ్యారు. మొత్తం గవవర్నర్ నియామకాల్లో ఐదుగురిని బదిలీ చేయగా, ముగ్గురిని కొత్తగా నియమించారు. బిహార్ గవర్నర్‌గా ఆరిఫ్ మహ్మద్‌ఖాన్ స్థానంలో సయ్యెద్ అటా హస్నైన్ నియమితులయ్యారు.
శివ్‌ప్రతాప్ శుక్లా రాజకీయ ప్రస్థానం
తెలంగాణ కొత్త గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా 1952లో యూపీలోని గోరఖ్‌పుర్‌లో జన్మించారు. రుద్రాపూర్‌లో స్కూల్ ఎడ్యుకేషన్, గోరఖ్‌పూర్‌లో కాలేజీ చేశాక, తరువాత లా పట్టా అందుకున్నారు. ఏబీవీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 1989లో గోరఖ్‌పూర్ నుంచి పోటీచేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో కల్యాణ్‌సింగ్, రాజ్‌నాథ్ సింగ్‌ల మంత్రివర్గాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 1991, 1993, 1996 ఎన్నికల్లోనూ విజయం సాధించి పలు పదవులు చేపట్టారు. 2016లో జూన్ 10న ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికై, నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. 2022 జులై 5 వరకు రాజ్యసభ ఎంపీగా కొనసాగారు. 2023 ఫిబ్రవరి 16 నుంచి హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా కొనసాగుతున్న శివ్ ప్రతాప్ శుక్లా తాజాగా తెలంగాణ గవర్నర్‌గా బదిలీ అయ్యారు.