UPSC Civil Services Result: యూపీఎస్సీ సివిల్స్ టాపర్‌గా అనూజ్ అగ్నిహోత్రి.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
UPSC CSE 2025 Results | యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ upsconline.nic.in లో రిజల్ట్స్ చేసుకోవాలని యూపీఎస్సీ సూచించింది.
UPSC CSE Result 2025 | దేశంలోనే అత్యున్న సర్వీసులైన UPSC CSE 2025 తుది ఫలితాలు విడుదలయ్యాయి. లక్షలాది మంది అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ శుక్రవారం మధ్యాహ్నం రిలీజ్ చేశారు. అనూజ్ అగ్నిహోత్రి యూపీఎస్సీ సివిల్స్ టాపర్‌గా నిలిచాడు. సివిల్ సర్వీసెస్ పరీక్షలో మొత్తం 958 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. జనరల్ కేటగిరీలో 317 మంది సెలక్ట్ కాగా, ఈడబ్ల్యూఎస్ (EWS) కోటా నుంచి 104 మంది, ఓబీసీ నుంచి 306 మంది, ఎస్సీ కేటగిరిలో 158, ఎస్టీ కేటగిరీ నుంచి 73 మంది పలు సర్వీసులకు ఎంపికయ్యారు. UPSC తన అధికారిక వెబ్‌సైట్‌లో సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫైనల్ రిజల్ట్స్ ప్రకటించింది. అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన స్టెప్స్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి వివరాలు నమోదు చేసి తమ ఫలితాలను చూడవచ్చు. ఫలితాలు విడుదలైన వెంటనే దేశవ్యాప్తంగా విజయం సాధించిన అభ్యర్థులు, వారి కుటుంబాల్లో ఆనందం నెలకొంది. ఇటీవల ఇంటర్వ్యూ నిర్వహించారు. పర్సనాలిటీ టెస్ట్ పాసైన అభ్యర్థుల మెరిట్ జాబితా తాజాగా విడుదల చేశారు.