... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
30వేల మందిని లేఆఫ్ చేసే పనిలో ఒరాకిల్.. ఏఐకి నిధుల కొరతతో రిక్రూట్మెంట్స్ బంద్

30వేల మందిని లేఆఫ్ చేసే పనిలో ఒరాకిల్.. ఏఐకి నిధుల కొరతతో రిక్రూట్మెంట్స్ బంద్

AI రేసులో అగ్రగామిగా నిలవాలనే తపన టెక్ దిగ్గజం 'ఒరాకిల్' సంస్థను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. ఏఐ డేటా సెంటర్ల విస్తరణ కోసం వేల కోట్ల ఖర్చు చేస్తున్న ఒరాకిల్.. ఇప్పుడు నిధుల కొరతను అధిగమించేందుకు చరిత్రలోనే అతిపెద్ద లేఆఫ్స్‌కు సిద్ధమవుతోంది. కంపెనీ ఈ నెలలోనే వేలాది మంది ఉద్యోగులపై వేటు పడే అవకాశం ఉందని రిపోర్ట్స్ బయటకు వస్తున్నాయి. ఈ భారీ పునర్నిర్మాణ ప్రక్రియ కోసం ఒరాకిల్ సుమారు రూ.13వేల 300 కోట్లు కేటాయించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

ఈ సంక్షోభానికి ప్రధాన కారణం ఒరాకిల్ చైర్మన్ లారీ ఎల్లిసన్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలకు ఏఐ క్లౌడ్ విభాగంలో గట్టి పోటీ ఇవ్వాలనే లక్ష్యంతో ఓపెన్ ఏఐతో ఏకంగా 300 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీని కోసం సుమారు 30 లక్షల జీపీయూలు, భారీ డేటా సెంటర్లు అవసరం. ఈ ఖర్చుల కోసం కేవలం రెండు నెలల్లోనే ఒరాకిల్ 58 బిలియన్ డాలర్లు అప్పులు కూడా చేసింది. అయితే తన ఏఐ ప్లాన్స్ కోసం ఇంకా నిధుల అవసరం ఉండటంతో లేఆఫ్స్ దిశగా నడుస్తోంది. ప్రస్తుతానికి కంపెనీ మొత్తం అప్పు 100 బిలియన్ డాలర్లు దాటిపోవడంతో వాల్ స్ట్రీట్ ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది.

ఆర్థిక ఒత్తిడి ప్రభావం కంపెనీ స్టాక్ విలువపై స్పష్టంగా కనిపిస్తోంది. సెప్టెంబర్ 2025లో గరిష్ట స్థాయికి చేరిన ఒరాకిల్ షేర్లు.. అప్పటి నుండి ఏకంగా 54 శాతం పతనమయ్యాయి. దీనివల్ల కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ నుంచి సుమారు 463 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయాయి. ఏఐ ప్రాజెక్టుల నుండి లాభాలు రావడానికి 2030 వరకు సమయం పడుతుందని అంచనా వేస్తుండటంతో.. తక్షణ నగదు నిల్వలను పెంచుకోవడానికి కంపెనీ కొత్త రిక్రూట్మెంట్స్ ఆపేసింది. ఏఐ వల్ల అవసరం లేదని భావించే విభాగాల్లో ఉద్యోగుల తొలగింపు ఎక్కువగా జరగనుందని నిపుణులు అంటున్నారు.

Source : V6 News

2 hours ago

Home Flash News