... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
Dhurandhar 2 Trailer: రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’ ట్రైలర్ రిలీజ్.. పార్ట్ 1 మించిన స్పై యాక్షన్!

Dhurandhar 2 Trailer: రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’ ట్రైలర్ రిలీజ్.. పార్ట్ 1 మించిన స్పై యాక్షన్!

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్, డైరెక్టర్ ఆదిత్యథర్ కాంబోలో వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ధురంధర్2’. మార్చి 19న మూవీ విడుదలకు సిద్ధమైంది. హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలోనూ విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా మేకర్స్ ‘ధురంధర్‌ 2’ ట్రైలర్ రిలీజ్ చేశారు. పార్ట్ 1ను మించేలా యాక్షన్, క్రైమ్ సీన్స్తో ట్రైలర్ పవర్ ఫుల్గా ఉంది. యాక్షన్ సీక్వెన్సులు హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. ‘ధురంధర్‌’ గతేడాది విడుదలై, ఎంతటి సంచలనం సృష్టించిందో.. అంతకు రెట్టింపు పంజా విసురుతూ ట్రైలర్ ఇంపాక్ట్ తీసుకొచ్చింది. ఈ సారి బాలీవుడ్తో పాటుగా టాలీవుడ్ ఆడియన్స్ కూడా థియేటర్లపై దండయాత్ర చేసేలా ఉన్నారు.

మొత్తానికి ఈ సీక్వెల్‌పై ఇండియన్ సినీ పేక్షకుల్లోనే కాదు వరల్డ్ వైడ్గా భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్ ఉండటంతో మరోసారి బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే అని సినీ వర్గాలు అంటున్నాయి.

‘ధురంధర్’ పార్ట్ 1: 2025 డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన 'ధురంధర్'.. బాలీవుడ్ బాక్సాఫీస్ లెక్కలను తిరగరాసింది. ఆదిత్యధర్ అద్భుతమైన మేకింగ్, రణవీర్ సింగ్ ఎనర్జీ తోడవ్వడంతో ఈ చిత్రం కాసుల వర్షం కురిపించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా గ్రాస్, ఇండియాలోరూ.836 కోట్ల నెట్ వసూలు చేసి 2025లో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఈ క్రమంలోనే "ధురంధర్" పార్ట్ 2 వస్తూ మరిన్ని అంచనాలు పెంచేసింది.

Source : V6 News

1 hour ago

Home Flash News