హైదరాబాద్ LB నగర్లో.. లక్ష లంచం తీసుకుంటూ.. ACBకి దొరికిపోయిన ఇద్దరు ఎస్ఐలు
హైదరాబాద్: హైదరాబాద్ సిటీలోని LB నగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ తనిఖీలు చేసింది. ఈ తనిఖీల్లో.. లంచం తీసుకుంటూ ఇద్దరు ఎస్ఐలు ఏసీబీకి దొరికిపోయారు. ఏసీబీ హైదరాబాద్ రేంజ్ 2 డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో సైబర్ స్టేషన్లో సోదాలు జరిగాయి.
సైబర్ క్రైమ్ కేసు నిమిత్తం అకౌంట్ ఫ్రీజ్ చేయకుండా ఉండడం కోసం ఆర్ఎస్ఐలు ప్రమోద్ కుమార్ గౌడ్, బాబు నాయక్.. బాధితుడి నుంచి లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. బాధితులు ఏసీబీని ఆశ్రయించడంతో ఏసీబీ అధికారులు ఈ సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో ఇద్దరు ఆర్ఎస్ఐలు ఏసీబీకి చిక్కారు.