హైదరాబాద్ లో మూత పడుతున్న ఎల్పీజీ గ్యాస్ స్టేషన్స్ .. సీఎన్జీ కేంద్రాల వద్ద బారులు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: సిటీలో ఆటో ఎల్పీజీ సరఫరా నిలిచిపోవడంతో డ్రైవర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్ ఎల్పీజీ స్టేషన్లకు సరఫరా ఆగిపోవడంతో చాలా వరకు మూతపడగా, అందుబాటులో ఉన్న కొన్ని చోట్ల ధరలు భారీగా పెంచేశారు.
కిలో ఎల్పీజీ ధర రూ. 63 ఉండగా, డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కొందరు డీలర్లు రూ. 97 నుంచి రూ. 100 వరకు వసూలు చేస్తున్నారు. మరోవైపు సీఎన్జీ కేంద్రాల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇంధనం కోసం ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో బారులు తీరుతున్నాయి.