... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
రూ.119 కోట్లతో తెలుగు కల్చరల్‌ సెంటర్‌ నిర్మాణానికి ఏపీ క్యాబినెట్‌ ఆమోదం

రూ.119 కోట్లతో తెలుగు కల్చరల్‌ సెంటర్‌ నిర్మాణానికి ఏపీ క్యాబినెట్‌ ఆమోదం

అమరావతి: సచివాలయం, హెచ్‌ఓడీ టవర్ల నిర్మాణాలకు ఏపీ క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ప్లంబింగ్‌ పనుల కోసం రూ.2,316 కోట్లకు పరిపాలనా అనుమతులిచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ క్యాబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతి అభివృద్ధి, ఉపాధి సృష్టి, జలవనరులు, వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటకం, విద్యుత్‌ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఆర్డీఏ నిర్ణయాలకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

క్యాబినెట్‌లో అజెండా అంశాలు ముగిసిన తర్వాత వివిధ అంశాలపై సీఎం చర్చించారు. గ్యాస్‌ కొరత రాకుండా నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. కొందరు గ్యాస్‌కు బదులుగా ఎలక్ట్రిక్‌ స్టవ్‌లు వాడుతున్నారని మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. ఎలక్ట్రిక్‌ స్టవ్‌లతో విద్యుత్‌ డిమాండ్‌ పెరగడంతో పరిస్థితి పర్యవేక్షించాలని సీఎం సూచించారు. ఏప్రిల్‌ 2న శాఖల పనితీరుపై నివేదికలు ఇస్తానని, వాటి ఆధారంగా సమీక్ష చేసుకొని పురోగతి సాధించాలని సూచించారు. ఏప్రిల్‌ 2 నుంచి 90 రోజులపాటు జలాధార కార్యక్రమం చేపట్టాలన్నారు. కాలువలు, డ్రెయిన్లు శుభ్రం చేయించి భూగర్భ జలాలను పెంచాలన్నారు. మే 15 నాటికి సాగునీరు విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. చివరి ఎకరానికి కూడా నీరిచ్చేలా జలాధార కార్యక్రమం జరగాలని సీఎం ఆదేశించారు.

రూ.119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్‌ నిర్మాణానికి ఆమోదం రాజధాని అమరావతిలో వివిధ సంస్థలకు భూకేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనలకు ఆమోదం 300 మంది హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులను రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులుగా అప్‌గ్రేడ్‌ ప్రతిపాదనకు ఆమోదం చిన్న పరిశ్రమలకు ఊతమిస్తూ దాదాపు 17వేలమందికి ఉపాధి లభించేలా చర్యలు 3,500 సూక్ష్మ పరిశ్రమలకు రూ.300 కోట్లు ఆర్థిక వనరులు కల్పించే ప్రతిపాదనలకు ఆమోదం ఎఫ్‌ఆర్‌ఏ పట్టాదారులకు రాయితీలు కల్పించే ప్రతిపాదనలకు ఆమోదం మిషన్‌ శక్తి కింద ‘ సఖీ నివాస్‌’ పేరుతో పనిచేసే మహిళల కోసం క్రెచ్‌ సౌకర్యాలతో హాస్టళ్లు తిరుపతి, విజయవాడ, విశాఖ అప్పీల్‌ కార్యాలయాల పరిధిపై నిర్ణయం ఏపీ పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ చట్ట గెజిట్‌కు ఆమోదం పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్‌లో పోలవరం, మార్కాపురం జిల్లాలు చేర్చే ప్రతిపాదనలను కేంద్రానికి పంపే అజెండాకు అమోదం పోలవరం ప్రాజెక్ట్‌ హెడ్‌ వర్క్స్‌లో అదనపు గ్రానైట్‌ కొనుగోలు, లైనింగ్‌ పనులకు రూ.23.47 కోట్లు కేటాయింపు పోలవరం ప్యాకేజ్‌-64 పనులకు రూ.24.51 కోట్లు మంజూరుకు అనుమతి ధవళేశ్వరం ఇరిగేషన్‌ సర్కిల్‌లో అత్యవసర మరమ్మతు పనులకు నిధుల మంజూరు

Source : V6 News

1 hour ago

Home Flash News