... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు నందాదేవి LPG ట్యాంకర్ .. హార్మూజ్ దాటొచ్చిన రెండో ఎల్పీజీ నౌక

 గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు నందాదేవి LPG ట్యాంకర్ .. హార్మూజ్ దాటొచ్చిన రెండో ఎల్పీజీ నౌక

అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎల్పీజీ సరఫరాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ‘నందాదేవి’ అనే ఎల్పీజీ ట్యాంకర్ మంగళవారం గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని వడినార్ పోర్టుకు చేరుకుంది. ఈ నౌకలో 47వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ ఉంది. ఇది హార్మూజ్ జలసంధి దాటి భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరిన రెండో ఎల్పీజీ నౌక. అంతకు ముందు సోమవారం శివాలిక్ ట్యాంకర్ ముంద్రా పోర్టుకు చేరుకుంది.

ఆ నౌకలో 46వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ ఉండగా, అది 32.4 లక్షల గృహ సిలిండర్లకు సమానమని అధికారులు తెలిపారు. ఈ ఒక్క నౌకతో దేశం ఒకరోజు ఎల్పీజీ దిగుమతి అవసరాన్ని తీర్చగలదని అంచనా వేశారు. నందాదేవి నుంచి సుమారు 24 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీని తమిళనాడుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ రెండు నౌకల రాకతో దేశంలో ఎల్పీజీ సరఫరా కొంతవరకు స్థిరపడే అవకాశం కనిపిస్తున్నది. ఇటీవల అనేక సిటీల్లో గ్యాస్ కొరతతో క్యూలు పెరిగాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న దుకాణాలు మూతపడే పరిస్థితి వస్తుందని భయం నెలకొన్నది.

Source : V6 News

1 hour ago

Home Flash News