... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
ఇరాన్‌కు శాశ్వత నష్టం తప్పదు: ట్రంప్‌

ఇరాన్‌కు శాశ్వత నష్టం తప్పదు: ట్రంప్‌

ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్‌-అమెరికా సంయుక్త దాడుల వల్ల ఇప్పటికే ఇరాన్‌ భారీగా నష్టపోయింది. ఓవైపు కీలక నేతలు వరుసగా ప్రాణాలు కోల్పోతుండగా.. మరోవైపు అణు స్థావరాలు, పౌర నివాసాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై దాడులు ఇంకా ముగియలేదని.. ఆ దేశానికి శాశ్వత నష్టం కలిగించడానికి అగ్రరాజ్యం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇప్పుడే యుద్ధాన్ని ఆపేసినా ఆ దేశాన్ని పునర్నిర్మించుకోవడానికి అక్కడి పాలకులకు 10 ఏళ్ల సమయం పడుతుందని అన్నారు. కానీ మళ్లీ కోలుకోలేనివిధంగా ఇరాన్‌కు నష్టం కలిగించాలన్నదే తమ లక్ష్యమని వెల్లడించారు.

మరో అధ్యక్షుడు ఇటువంటి తప్పు చేయకుండా ఇరాన్‌ (Iran)కు తగిన బుద్ధి చెబుతామని ట్రంప్ పేర్కొన్నారు. ఆ దేశంపై తాము చేపట్టిన ఆపరేషన్‌ సరైన దిశలోనే వెళుతోందన్నారు. భవిష్యత్తులో ఇరాన్‌ నుంచి ఎవరికీ అణుముప్పు కలగకుండా చూడటమే తమ లక్ష్యమన్నారు. మరో రెండు వారాల పాటు ఈ యుద్ధం కొనసాగే అవకాశం ఉందన్నారు. తాము ముందస్తు దాడులను ప్రారంభించకపోయి ఉంటే ఇరాన్‌ ఇప్పటికే పలు అణ్వాయుధాలను అభివృద్ధి చేసేదని పేర్కొన్నారు.

హర్మూజ్‌ జలసంధికి యుద్ధ నౌకలను పంపడానికి నాటోతో పాటు మిత్రదేశాలు నిరాకరించడంపై ట్రంప్ అసహనం వ్యక్తంచేశారు. ఈ విషయంలో నాటో తెలివితక్కువగా ప్రవర్తిస్తోందన్నారు. హర్మూజ్‌ జలసంధి (Strait Of Hormuz)ని తెరిపించాల్సిన అవసరం ఉన్నప్పటికీ తమ మిత్రదేశాలు ముందుకురావట్లేదన్నారు. అయినప్పటికీ వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు. తమది ప్రపంచంలోనే అత్యంత బలమైన దేశమని..అత్యంత శక్తిమంతమైన సైన్యం తమకు ఉందని పునరుద్ఘాటించారు.

Source : Eenadu Telugu

2 hours ago

Home Flash News