24 గంటల్లోపే వస్తువుల డెలివరీ.. తపాలా శాఖలో 3 కొత్త స్కీములు
న్యూఢిల్లీ: తపాలా శాఖ 24 గంటలు, 48 గంటల డెలివరీ హామీతో మూడు ప్రత్యేక సేవలను ప్రారంభించింది. ప్రైవేటు కొరియర్ సంస్థల నుంచి పోటీని ఎదుర్కోవడానికి 24 స్పీడ్ పోస్ట్, 24 స్పీడ్ పోస్ట్ పార్సిల్, 48 స్పీడ్ పోస్ట్ సేవలను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు.
మొదటి విడతలో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో ఇవి అందుబాటులోకి వస్తాయి. 2027 మార్చి నాటికి దేశవ్యాప్తంగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026 ఆర్థిక సంవత్సరం 11 నెలల్లో ఈశాఖ ఆదాయం 20 శాతం పెరిగింది. ఈ-కామర్స్ రంగం పెరుగుతున్న నేపథ్యంలో పార్సిల్ విభాగం వృద్ధి ఇంజిన్‌గా మారుతుందని సింధియా ఆశాభావం వ్యక్తం చేశారు.