... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
మిస్ ఇన్ఫినిటీ - 2026 కిరీటాన్ని గెలుచుకున్న దీప్తి శ్రీరంగం

మిస్ ఇన్ఫినిటీ - 2026 కిరీటాన్ని గెలుచుకున్న దీప్తి శ్రీరంగం

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దీప్తి శ్రీరంగం మిస్ ఇన్ఫినిటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన పోటీలో ప్రతిష్ఠాత్మకమైన మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుంది.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దీప్తి శ్రీరంగం (Deepti Srirangam) మిస్ ఇన్ఫినిటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన పోటీలో ప్రతిష్ఠాత్మకమైన మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుంది. 7 సంవత్సరాల కఠిన శ్రమ, పట్టుదలతో ఆమె ఈ విజయాన్ని సాధించింది. దేశవ్యాప్తంగా 500కి పైగా పాల్గొన్న ఈ పోటీలో దీప్తి విజేతగా నిలవడం గొప్ప విషయమని ముఖ్య అతిథిగా హాజరైన సంగీత దర్శకుడు కోటి అన్నారు. ఈ పోటీకి జ్యూరీ సభ్యులుగా ప్రముఖ హీరోయిన్లు మౌనిక కలపాల, నక్ష శరన్, డా. అక్షయ, ప్రణూప్ జవహర్ పాల్గొని అభ్యర్థుల ప్రతిభను విశ్లేషించారు.

ఈ షో ఆర్గనైజర్స్ మాట్లాడుతూ 'మహిళా సాధికారత, ఆత్మవిశ్వాసం, భారతదేశ ఐక్యతకు ప్రతీకగా ఈ ఫ్యాషన్ షో నిర్వహించాం. ప్రతి ఫైనలిస్ట్ తమ రాష్ట్రపు సంస్కృతి, సంప్రదాయం, ప్రత్యేకతలను ప్రతిబింబిస్తూ పోటీలో పాల్గొనటం గొప్పగా అనిపించింది. అభ్యర్థుల వ్యక్తిత్వం, ప్రతిభ, ఆత్మవిశ్వాసం, స్టేజ్ ప్రెజెన్స్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని దీప్తిని విజేతగా జూరీ మెంబర్స్ ఎంపిక చేశారు. త్వరలో కిడ్స్ కి, టీనేజర్స్ కి మరిన్ని సెగ్మెంట్స్ లో కూడా ఫ్యాషన్ షోలు నిర్వహిస్తాం' అని తెలిపారు.

సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ 'మహిళ అంటేనే అందం. అలాంటి మహిళలు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళ సంస్కృతికి తగినట్టు వేషధారణలో ఫ్యాషన్ షో లో పాల్గొనడం గొప్పగా అనిపించింది. మహిళలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ వాళ్లలోని కొత్తదనం, చక్కదనం ప్రపంచానికి తెలియజేస్తూ మిస్ ఇన్ఫినిటీ ఆఫ్ ఇండియా వారు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలి' అని అన్నారు.

Source : Smacy News

2 hours ago

Home Flash News