... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
Glenn Phillips: బ్యాట్, బాల్తోనే కాదు ఫ్లైట్ నడిపిన గుజరాత్ ప్లేయర్

Glenn Phillips: బ్యాట్, బాల్తోనే కాదు ఫ్లైట్ నడిపిన గుజరాత్ ప్లేయర్

Glenn Phillips: న్యూజిలాండ్ స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ ఓ విమానం నడిపి అందరినీ షాక్ కి గురి చేశాడు. కేవలం బ్యాట్, బాల్ తోనే కాదు చిన్న ఫ్లైట్ నడిపి సత్తా చాటాడు. కేవలం స్టేడియంలో సిక్సులు కొట్టడం, బౌలింగ్ తో వికెట్లు పడగొట్టడమే కాకుండా.. విమానంతో గాల్లో చక్కర్లు కొట్టడం కూడా తనకు తెలుసంటూ చెప్పుకొచ్చాడు. తాజాగా ఫిలిప్స్ ఫ్లైట్ నడిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆక్లాండ్ లో ఆర్మూర్ ఏరోడ్రోమ్ లో ఓ చిన్న విమానాన్ని మంగళవారం (మార్చి 17న) విజయవంతంగా ల్యాండ్ చేసి, ఫిలిప్స్.. పైలట్ గా తన స్కిల్స్ ని ప్రదర్శించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఫిలిప్స్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందే దిశగా తన ప్రయాణాన్ని కొనసాగించినట్లు తెలుస్తుంది. తాను ఇటీవల ఆర్డ్మెర్ ఫ్లయింగ్ స్కూల్లోని విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడినట్లు తెలిపాడు. అతడు తనకు విమానాలంటే ఇష్టమని అనేక సార్లు చెప్పాడు.

అయితే తన దగ్గర చాలా డబ్బు ఉండి ఉంటే, క్రికెట్ కి బదులుగా విమానయాన రంగంలో కెరీర్ ని సెలక్ట్ చేసుకునే వాడినని గ్లెన్ ఫిలిప్స్ అన్నారు. క్రికెట్ తర్వాత కెరీర్ ఎంచుకునే విషయానికి వస్తే, పైలట్ అవడమే తన జాబితాలో ఫస్ట్ ప్లేస్ ఉంటుందని తెలిపారు. నాకు విమానాలు నడపడమంటే చాలా ఇష్టం.. నిజం చెప్పాలంటే, నా దగ్గర బోలెడంత డబ్బు ఉండి ఉంటే, నేను క్రికెటర్ ని కాకుండా, పైలట్ అయ్యేవాడిని అన్నారు. గాలిలో ఉండటం నాకు చాలా ఇష్టమని వెల్లడించాడు. త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026లో ఫిలిప్స్ గుజరాత్ టైటాన్స్ తరపున బరిలోకి దిగబోతున్నాడు.

Source : V6 News

1 hour ago

Home Flash News