... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
కువైట్‌లో కీలకమైన రిఫైనరీపై ఇరాన్‌ దాడి

కువైట్‌లో కీలకమైన రిఫైనరీపై ఇరాన్‌ దాడి

ఇంటర్నెట్‌డెస్క్‌: గల్ఫ్‌ దేశాల్లోని కీలక చమురు వ్యవస్థలే లక్ష్యంగా ఇరాన్‌ (Iran) తన దాడులను తీవ్రతరం చేసింది. ఇటీవల ఖతార్‌లోని రస్‌ లఫాన్‌ గ్యాస్‌ క్షేత్రంపై, సౌదీ అరేబియాకు చెందిన అరామ్‌కోపై దాడులు చేయగా.. తాజాగా కువైట్‌ (Kuwait)లో కీలకమైన మినా అల్‌- అహ్మదీ ఆయిల్‌ రిఫైనరీపై డ్రోన్‌ దాడికి పాల్పడింది.

కువైట్‌లో శుక్రవారం రంజాన్‌ పండుగ జరుపుకుంటున్న తరుణంలోనే ఈ దాడి జరగడం గమనార్హం. పశ్చిమాసియాలో అతిపెద్ద రిఫైనరీల్లో ఈ మినా అల్‌- అహ్మదీ (Mina Al-Ahmadi oil refinery) కూడా ఒకటి. డ్రోన్‌ దాడి నేపథ్యంలో రిఫైనరీలో భారీగా మంటలు చెలరేగాయి. అధికారులు వాటిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా లేదా అనే విషయం ఇంకా తెలియరాలేదు. రోజుకి దాదాపు 7,30,000 బ్యారెళ్ల చమురు శుద్ధి చేయగల ఈ రిఫైనరీపై గురువారం కూడా ఇరాన్‌ దాడి చేసింది.

దుబాయ్‌లో భారీ పేలుళ్లు..

దుబాయ్‌ (Dubai) నగరం పైకి ఇరాన్‌ డ్రోన్‌లు దూసుకురాగా, వైమానిక రక్షణ వ్యవస్థలు వాటిని అడ్డుకొన్నాయి. ఈ క్రమంలో భారీ పేలుళ్లు వినిపించాయి. ఇక, తమపై దూసుకొచ్చిన ఓ క్షిపణిని అడ్డుకొన్నట్లు బహ్రెయిన్‌ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ క్రమంలో దాని శకలాలు ఓ గిడ్డంగిపై పడటంతో మంటలు చెలరేగాయని పేర్కొంది.

Source : V6 News

1 hour ago

Home Flash News