... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
వంట గ్యాస్, పెట్రోల్ డీజిల్పై లోక్ సభలో ప్రధాని మోదీ కీలక ప్రకటన

వంట గ్యాస్, పెట్రోల్ డీజిల్పై లోక్ సభలో ప్రధాని మోదీ కీలక ప్రకటన

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్లో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం, పశ్చిమాసియాలో పరిస్థితులపై మాట్లాడారు. భారత్కు ఈ యుద్ధం ఎన్నో సవాళ్లను తెచ్చిపెట్టిందని ప్రధాని గుర్తుచేశారు. పశ్చిమాసియాలో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవని.. 3 లక్షల 75 వేల మంది సేఫ్గా ఇండియాకు చేరుకున్నారని తెలిపారు.

ఈ యుద్ధం భారత్కు సమస్యలు తెచ్చిపెట్టిందని.. గల్ఫ్లో ఉన్న కోటి మంది భద్రతపై ఆందోళన నెలకొందని ప్రధాని మోదీ చెప్పారు. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లోని భారతీయులకు కేంద్రం అండగా ఉందని.. 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు.

హార్మూజ్ జలసంధి ద్వారా నౌకల ప్రయాణం కష్టంగా మారిందని.. క్రూడాయిల్ సప్లై చేసే దేశాలతో నిరంతరం మాట్లాడుతున్నామని ప్రధాని మోదీ పార్లమెంట్కు తెలియజేశారు. ప్రజలకు వంట గ్యాస్, పెట్రోల్ కొరత లేకుండా చూసుకుంటున్నామని తెలిపారు. మొదటి నుంచి యుద్ధాలకు భారత్ వ్యతిరేకం అని ప్రధాని మోదీ చెప్పారు.

41 దేశాల నుంచి క్రూడాయిల్ను దిగుమతి చేసుకుంటున్నామని.. 60 శాతం ఎల్పీజీని భారత్ లో ఉత్పత్తి చేస్తున్నామని దేశ ప్రజలకు ప్రధాని తెలియజేశారు. ప్రపంచానికి ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉందని.. భారత్పై మాంద్యం ప్రభావం లేకుండా చూస్తున్నామని మోదీ చెప్పారు. యుద్ధానికి చర్చలతోనే పరిష్కారం అని ప్రధాని నరేంద్ర మోదీ హితవు పలికారు.

Source : V6 News

1 hour ago

Home Flash News