ప్రపంచం మునుపెన్నడూ చూడని ఇంధన సంక్షోభం.. అంతర్జాతీయ ఇంధన సంస్థ హెచ్చరిక!
ఇరాన్ మరియు అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం దాదాపు మూడు వారాలుగా కొనసాగుతోంది, దీనికి ముగింపు కనిపించడం లేదు. ఈలోగా, ప్రపంచంలోనే అత్యంత కీలకమైన జలమార్గమైన హోర్ముజ్ జలసంధి మూసుకుపోతోంది. దీంతో భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) ఇంధన సంక్షోభంపై హెచ్చరించింది.

అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై దాడి చేస్తామని ఇరాన్ బెదిరించడంతో, మధ్యప్రాచ్యం నుంచి వచ్చే ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ యుద్ధం వల్ల తలెత్తిన ఇంధన సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన ముప్పును కలిగిస్తోందని, దీని ప్రభావం నుంచి ఏ దేశమూ తప్పించుకోలేదని ఐఈఏ అధిపతి ఫాతిహ్ బిరోల్ అన్నారు. సోమవారం (మార్చి23) ఆస్ట్రేలియా రాజధానిలోని నేషనల్ ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతూ, “ప్రస్తుత పరిస్థితి గతంలో వచ్చిన రెండు చమురు సంక్షోభాల కలయికలా ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటోంది. ఈ సమస్య త్వరలో పరిష్కారమవుతుందని ఆశిస్తున్నాను. ఈ సంక్షోభం ఇదే దిశలో కొనసాగితే, ఏ దేశమూ దాని ప్రభావం నుంచి తప్పించుకోలేదు. తక్షణమే ప్రపంచవ్యాప్తంగా ఇందన పొదుపు చర్యలు అవసరం” అని ఆయన అన్నారు.
రాబోయే చమురు సంక్షోభం గురించి ఐఈఏ గతంలోనే హెచ్చరించింది. గత శుక్రవారం, ఈ సంక్షోభ ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వాలు, అయిల్ కంపెనీలు తీసుకోగల సూచనలను ఈ సంస్థ అందించింది. మార్చి 11న, ఐఈఏ సభ్య దేశాలు అత్యవసర నిల్వల నుండి 400 మిలియన్ బ్యారెళ్ల చమురును విడుదల చేయడానికి అంగీకరించాయి. ఇది ఈ సంస్థ చరిత్రలో నిల్వల నుండి చేసిన అతిపెద్ద ఉపసంహరణ.