... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
Amaravati: రాజధానికి రాజముద్ర..! రూట్ క్లియర్ అయినట్లేనా? అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల వెనుక వ్యూహం ఇదేనా?

Amaravati: రాజధానికి రాజముద్ర..! రూట్ క్లియర్ అయినట్లేనా? అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల వెనుక వ్యూహం ఇదేనా?

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం విభజిత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే కొత్త రాజధానిని ఎంచుకోవాలి. 2014 జూన్‌ 2ను అపాయింటెడ్‌ డేగా నిర్ణయిస్తూ, రెండు రాష్ట్రాలకు పదేళ్ల పాటు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చెప్పారు.

Amaravati: వేల కోట్లతో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం. మిషన్ మోడ్‌లో పనులు. పెద్ద పెద్ద టవర్లు. ఇంటర్నేషనల్ లెవల్ స్టాండర్డ్స్‌తో నిర్మాణాలు. ఇలా ఏడాదిన్నరగా అమరావతి అన్‌స్టాపబుల్‌ అన్నట్లుగా దూసుకెళ్తోంది. గతానికి మించి కొత్త కలతో కళకళలాడటమే కాదు..సరికొత్తగా రూపుదిద్దుకుంటోంది. కానీ ఒక్కటే బాకీ ఉంది. అదే రాజధాని రాజముద్ర. రాజముద్ర పడితే ఇక నో ప్రాబ్లమ్‌. ఇటు రైతులు..అటు సీఎం చంద్రబాబు అందరి మదిలో ఉన్నమాట ఇది. ఇందుకోసం కూటమి సర్కార్ చేసిన ప్రయత్నాలన్నీ ఫైనల్‌ స్టేజ్‌కు చేరి..అమరావతికి హోదా దక్కేందుకు రూట్‌ క్లియర్ అవుతోంది.

కూటమి సర్కార్ ప్రెజర్..కేంద్ర ప్రభుత్వ చర్యలు అన్నట్లుగా డెవలప్‌మెంట్‌ నడిచింది. కానీ సడెన్‌గా ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం అంటూ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశమై..ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని గుర్తించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేయనుంది. ఆ తీర్మానానికి గవర్నర్‌ ఆమోదం తెలిపిన వెంటనే నోటిఫికేషన్‌ జారీ కానుంది. దాన్ని కేంద్రానికి పంపించనుంది ఏపీ సర్కార్. ప్రస్తుత పార్లమెంట్ సెషన్‌లోనే విభజన చట్ట సవరణ బిల్లు పెట్టి..అమరావతిని ఏపీ రాజధానిగా బిల్‌ పాస్ చేయనున్నారు.ఆంధ్రప్రదేశ్ పర్యాటకం

అయితే రాజధానికి రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపితే చాలు అంటున్నారు. కానీ ఫ్యూచర్‌లో సమస్యలు రాకుండా ఉండాలంటే అసెంబ్లీలో తీర్మానం చేయడమే బెటర్ అని భావిస్తున్నారట. పీఎంవో నుంచి అందిన సూచనల ప్రకారమే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి తీర్మానం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారట. అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ రాష్ట్ర విభజన చట్టంలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్రం ఇప్పటికే సానుకూలంగా స్పందించింది. కేంద్రం డౌట్స్ అన్నింటిని క్లారిఫై చేసిన ఏపీ ప్రభుత్వం పూర్తి సమాచారాన్ని అందజేసింది. ఈ క్రమంలోనే ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే రాష్ట్ర విభజన చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం..ఏపీ అసెంబ్లీ నుంచి ప్రత్యేక తీర్మానం కోరినట్లు తెలుస్తోంది.

Source : Ntv

2 hours ago

Home Flash News