ఇన్ని రోజులు ఇది తెలియలేదే.. పెట్రోల్, డీజర్ ధరల పెరగడానికి మెయిన్ రీజన్స్ ఇవేనట!
పశ్చిమాసియా యుద్ధం కారణంగా నెలకొన్ని చమురు కొరతతో దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్‌లు పెరిగిపోతున్నాయి. ఇటీవలే కొన్ని చమురు కంపెనీలు పవర్ పెట్రోల్ ధరపై లీటరుకు సుమారు రూ. 2 నుండి రూ. 2.3 వరకు పెంచాయి. అలాగే నయారా వంటి కంపెనీలు సాధారణ పెట్రోల్ ధరలను కూడా పెంచాయి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో అన్ని కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతాయనే చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో అసలు పెట్రోల్ ధరలు పెరడగానికి మెయిన్ రీజన్ ఏంటీ.. దేశంలో ఇంధన ధరలను ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలు ఏంటో ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాం.
దేశంలో పెట్రోల్, డీజిల్ పెరగడం అనేది కొన్ని ముఖ్యమైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ ముడి చమురు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పన్నుల ప్రభావం, రూపాయి విలువ పతనం , డీలర్ కమీషన్, రవాణా ఖర్చులు ఇవన్ని ఇందన ధరల మార్పుల్లో కీలక పాత్ర పోషిస్తాయి.
అంతర్జాతీయ ముడిచమురు ధరలు: పెట్రోల్, డీజిల్ తయారు కావాలంటే ముడిచమురు అనేది చాలా ముఖ్యం. మన దేశంలో ముడిచమురు నిల్వలు చాలా తక్కువ కాబట్టి మనం సుమారు 85 శాతం ముడి చమురును ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తున్నాం. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడి చమురు ధర పెరిగితే, మన దేశంలో కూడా లీటరు పెట్రోల్ ధర పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడం లేదా ఉత్పత్తి తగ్గడం వల్ల ఈ ధరలు మారుతుంటాయి.
రూపాయి మారకం విలువ: మనం దేశం అంతర్జాతీయ మార్కెట్ నుంచి ముడి చమురును కొనుగోలు చేసేందుకు రూపాయల్లో కాకుండా అమెరికన్ డాలర్లలో చెల్లింపులు చేస్తుంది. కాబట్టి డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గితే, దిగుమతి ఖర్చులు పెరిగి ఇంధన ధరలు కూడా పెరుగుతాయి. అదే డాలర్ విలువ తగ్గితే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గుతాయి.