రేపు లోక్‌సభ ముందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు
దిల్లీ: పార్లమెంట్ ముందుకు ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లు రానుంది. కేంద్ర హోంశాఖ బుధవారం లోక్‌సభలో ఏపీ పునర్విభజన సవరణ చట్టం పేరుతో ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు లోక్‌సభ బిజినెస్ జాబితాలో దీన్ని చేర్చారు. అక్కడ ఆమోదం తర్వాత రాజ్యసభ ముందుకు వెళ్లనుంది. రేపు, ఎల్లుండిలోపు ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందనుంది. రాజధాని అమరావతికి చట్టబద్ధతపై ఏపీ ప్రభుత్వం ఈనెల 28న అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన విషయం తెలిసిందే.