... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
#డీఎంకే వారసుడికి అగ్నిపరీక్ష!

డీఎంకే వారసుడికి అగ్నిపరీక్ష!

తమిళనాడు రాజకీయ సమరం 2026 ఇప్పుడు ఒక కీలక మలుపుకు చేరుకుంది. ముఖ్యంగా డీఎంకేకు ఈ ఎన్నికలు రెండు విధాలుగా అత్యంత కీలకమైనవి. ఒకటి స్టాలిన్ పాలనకు..రెండు డీఎంకే వారసుడికి ఈ ఎన్నికలు చాలా ముక్యం. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ పార్టీకి మార్గదర్శి గా, విధానకర్తగా వ్యవహరిస్తుండగా.. ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని నడిపిస్తున్నారు. ఈ ఎన్నికలు ఉదయనిధికి కేవలం ఒక ఎన్నికలు మాత్రమే కావు, అది ఆయన రాజకీయ భవిష్యత్తును, వారసత్వ గుర్తింపును నిర్ణయించే అగ్నిపరీక్ష . డీఎంకేను వరుసగా రెండోసారి అధికారంలోకి తీసుకురాగలిగితే, పార్టీపై ఆయన పట్టు తిరుగులేనిదిగా మారుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ప్రచార సైన్యాధ్యక్షుడిగా ఉదయనిధి

ముఖ్యమంత్రి స్టాలిన్ కేవలం జిల్లా కేంద్రాల్లో జరిగే ప్రధాన బహిరంగ సభలకే పరిమితమవుతుండగా, ఉదయనిధి మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ పర్యటిస్తున్నారు. రోడ్ షోలు, గల్లీ మీటింగ్‌ల ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు. ముఖ్యంగా యువతను, మహిళా ఓటర్లను ఆకట్టుకోవడంలో ఆయన సక్సెస్ అవుతున్నారు. తన ప్రసంగాల్లో ద్రావిడ మోడల్ అభివృద్ధిని వివరిస్తూనే, కేంద్రంలోని బీజేపీపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు తమిళనాడులో రాజకీయ సెగలు పుట్టించడమే కాకుండా, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.

వారసత్వ ముద్ర - ఒక సవాల్

విపక్షాలు, ముఖ్యంగా అన్నాడీఎంకే, నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీలు ఉదయనిధి ఎదుగుదలను వారసత్వ రాజకీయం గా అభివర్ణిస్తూ దాడి చేస్తున్నాయి. ఈ విమర్శలను తిప్పికొట్టాలంటే కేవలం మాటలతో సరిపోదని, ఎన్నికల్లో ఫలితాల ద్వారా నిరూపించుకోవాలని ఉదయనిధి కంకణం కట్టుకున్నారు. అందుకే అభ్యర్థుల ఎంపిక నుంచి, మేనిఫెస్టో రూపకల్పన వరకు అన్నింటా ఆయన ముద్ర కనిపిస్తోంది. పార్టీలోని సీనియర్ నేతలను కలుపుకుపోతూనే, కొత్త తరం నాయకత్వానికి ఆయన పెద్దపీట వేస్తున్నారు.

విజయ్ రాకతో మారిన సమీకరణాలు

తమిళ సూపర్ స్టార్ విజయ్ రాజకీయ రంగప్రవేశం ఉదయనిధికి ఒక కొత్త సవాల్‌గా మారింది. యువత ఓట్లు చీలిపోకుండా చూడటమే ఇప్పుడు ఆయన ముందున్న ప్రధాన లక్ష్యం. విజయ్ ప్రభావాన్ని తగ్గించేందుకు ఉదయనిధి తన ప్రచార వ్యూహాన్ని మార్చుకున్నారు. సినిమా గ్లామర్ కంటే సంక్షేమ పథకాల గ్లామర్ గొప్పదని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో డీఎంకే విజయం సాధిస్తే, స్టాలిన్ తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఉదయనిధికి పూర్తిస్థాయి అర్హత లభించినట్లవుతుంది. తమిళనాడు రాజకీయ ముఖచిత్రంలో ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు ఒక శక్తివంతమైన కేంద్రబిందువుగా మారారు. ఆయన పడుతున్న కష్టం ఫలిస్తుందా లేదా అనేది ఫలితాలే తేల్చనున్నాయి.

Source : Telugu360

1 hour ago

Home Flash News