అర్షదీప్ 11 బంతుల ఓవర్..103 మీటర్ల భారీ సిక్స్
ఐపీఎల్ 2026 నాలుగో మ్యాచ్ లో పంజాబ్ జట్టు గుజరాత్ పై గెలిచింది. అర్షదీప్ ఒకే ఓవర్లో 11 బంతులు వేశాడు.. ఇంకా ఈ మ్యాచ్ హైలైట్స్ ఇవే.
IPL 2026 Match 4 Highlights: ఐపీఎల్ మ్యాచ్ 4 మంగళవారం పంజాబ్-గుజరాత్ ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్‌ను 3 వికెట్ల తేడాతో ఓడించింది. న్యూ చండీగఢ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు రికార్డులు నమోదయ్యాయి. ఐపీఎల్ మ్యాచ్‌లలో 7 నుంచి 16 ఓవర్ల దశలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా యజ్వేంద్ర చాహల్ నిలిచాడు. అలాగే, అర్ష్‌దీప్ సింగ్ ఒక ఓవర్‌లో అత్యధిక బంతులు వేసిన చెత్త రికార్డును సమం చేశాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం.
ఈ మ్యాచ్ లో ఇద్దరు ఆటగాళ్లు ఐపీఎల్ లో ఆరంగేట్రం చేసహ్రు. ఫాస్ట్ బౌలర్ అశోక్ శర్మ గుజరాత్ టైటాన్స్ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేయగా, పంజాబ్ కింగ్స్‌కు చెందిన కూపర్ కానలీ కూడా ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. చాహల్ గిల్‌ను నాలుగోసారి అవుట్ చేశాడు 10వ ఓవర్ మూడో బంతికి యుజ్వేంద్ర చాహల్ శుభ్‌మన్ గిల్‌ను ఔట్ చేశాడు. చాహల్ బంతిని నెమ్మదిగా వేశాడు. గిల్ మిడ్-వికెట్ మీదుగా స్లాగ్ స్వీప్ చేయడానికి ప్రయత్నించగా, బంతి అతని బ్యాట్ మిడిల్ కాలేదు. దీంతో డీప్ మిడ్-వికెట్‌లో నిలబడిన కూపర్ కానలీ సులభమైన క్యాచ్ అందుకున్నాడు. గిల్ 27 బంతుల్లో 39 పరుగులు చేశాడు.దీంతో ఐపీఎల్‌లో చాహల్ నాలుగోసారి గిల్‌ను ఔట్ చేసినట్లయింది. అత్యధిక ఐపీఎల్ డిస్మిసల్స్ రికార్డును చాహల్ ఇప్పుడు మరో ఐదుగురు బౌలర్లతో పంచుకున్నాడు. చాహల్‌కు ముందు, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్, హార్దిక్ పాండ్యా, ఆన్రిచ్ నార్ట్‌జాయ్ కూడా ఐపీఎల్‌లో గిల్‌ను ఒక్కొక్కరు నాలుగు సార్లు ఔట్ చేశారు.
అర్షదీప్ చెత్త ఓవర్..
అర్షదీప్ సింగ్ ఒకే ఓవర్ లో 11 బంతులు వేసిన చెత్త రికార్డ్ మూటగట్టుకున్నాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసిన అర్షదీప్ ఒక నో బాల్ సహా నాలుగు వైడ్స్ వేశాడు. ఓవర్ చివరి బంతి కూడా వైడ్ అయ్యేదే. కానీ, కొద్దిలో మిస్ అయింది. మొదట అంపైర్ ఆ బాల్ ను వైడ్ గా ప్రకటించారు. దీంతో అర్షదీప్ అప్పీల్ కి వెళ్ళాడు. థర్డ్ అంపైర్ చెక్ లో ఆ బాల్ బ్యాటర్ కాలును తాకుతూ వెళ్లినట్టు కనిపించింది. దీంతో అర్షదీప్ సరికొత్త చెత్త రికార్డు మిస్ అయ్యాడు. ఎందుకంటే, అప్పటికే అతను ఆ ఓవర్ లో 11 బంతులు వేశాడు. ఇంకో బంతి కూడా వేసి ఉంటే.. ఒకే ఓవర్ లో 12 బంతులు వేసిన రికార్డ్ నమోదు అయ్యేది.