లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం ఆంధ్రులకు దక్కిన గౌరవం
లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం ఆంధ్రులకు దక్కిన గౌరవమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం ఆంధ్రులకు దక్కిన గౌరవమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేసిన ఆయన బిల్లుకు మద్ధతు తెలిపిన అన్ని పార్టీలకు ఏపీ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. పోస్టులో.. ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక. ఈరోజు లోక్‌సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందడం ఆంధ్రులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. గత పాలనలో ఎదురైన చీకట్లు తొలగిపోయి, అమరావతి భవిష్యత్తు పై ఉన్న సందిగ్ధతకు శాశ్వతంగా తెరపడింది. రైతుల త్యాగానికి, ప్రజల ఆకాంక్షలకు దక్కిన గౌరవం ఇది. స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఇది ఓ కీలక మైలురాయి. అమరావతి ఇక అజేయం..అజరామరం. రాజధానిని విశ్వనగరంగా తీర్చిదిద్ది ప్రపంచ పటంలో నిలుపుతాం. సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీ గారికి, హోం మంత్రి అమిత్ షా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. లోక్ సభలో బిల్లుకు మద్దతు పలికిన అన్ని పార్టీలకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు యపేర్కొన్నారు.