... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
క్రెడిట్‌ రిపోర్ట్‌ను రెగ్యులర్‌గా ఎందుకు పర్యవేక్షించాలి?

క్రెడిట్‌ రిపోర్ట్‌ను రెగ్యులర్‌గా ఎందుకు పర్యవేక్షించాలి?

ప్రతి ఒక్కరూ తమ శారీరక ఆరోగ్యం వలె, వారి వ్యక్తిగత ఆర్థిక ఆరోగ్యాన్ని కూడా గమనిస్తూ ఉండాలి. అయితే, ప్రస్తుతం సులభంగా యాక్సెస్ చేయగలిగే పరిస్థితులు ఉన్నప్పటికీ, చాలా మంది తమ క్రెడిట్ రిపోర్ట్‌లను తనఖీ చేయడానికి నిర్లక్ష్యం చూపుతున్నారు. ఇది ఆర్థిక స్థిరత్వానికి అత్యవసరమైన క్రెడిట్ అవగాహనలో ఉన్న అంతరాన్ని ఎత్తి చూపుతోంది. మంచి ఆర్థిక స్థితిని కాపాడుకోవడానికి మీ క్రెడిట్ రిపోర్ట్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం చాలా అవసరం. ప్రతి ఒక్కరూ రోజూ కాకపోయినా, కనీసం మూడు నెలలకు ఒకసారి లేదా సంవత్సరానికి రెండు సార్లు అయినా తమ క్రెడిట్‌ రిపోర్ట్‌ను పర్యవేక్షించాలి. ఇలా చేయాల్సిన అవసరం ఏంటో, ఇది ఎందుకు అంత ముఖ్యమో ఇక్కడ తెలుసుకుందాం. క్రెడిట్‌ రిపోర్ట్‌ క్రెడిట్ రిపోర్ట్‌.. 

మీ క్రెడిట్ చరిత్రకు సంబంధించిన వివరణాత్మక రికార్డు. దీన్ని CIBIL, CRIF హై మార్క్, ఎక్స్పీరియన్, ఈక్విఫాక్స్ వంటి క్రెడిట్ బ్యూరోలు నిర్వహిస్తున్నాయి. ఇందులో మీకు సంబంధించిన కీలక ఆర్థిక సమాచారముంటుంది. మీ క్రెడిట్‌ ఖాతాలు(క్రెడిట్‌ కార్డులు, రుణాలు), చెల్లింపుల చరిత్ర, చెల్లించాల్సిన బకాయిలు, క్రెడిట్‌ వినియోగం, క్రెడిట్‌ విచారణలు, డిఫాల్ట్‌లు లేదా సెటిల్‌మెంట్లు మొదలైనవి ఉంటాయి. కాబట్టి, క్రెడిట్‌ రిపోర్టును తనిఖీ చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన లోటుపాట్లను, మీకు సంబంధించిన ఆర్థిక విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. రుణాలు సుమారు 60 కోట్లకు పైగా భారతీయులు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో బ్యాంకుల వద్ద రుణం తీసుకున్నవారేనని గణాంకాలు సూచిస్తున్నాయి. అయితే, రుణం తిరస్కారానికి గురవ్వడం లేదా తక్కువ క్రెడిట్ స్కోరు కారణంగా సరైన నిబంధనలు ఉండకపోవడం వంటి ఏదైనా సమస్య ఎదురయ్యే వరకు మనలో చాలా మందికి తనిఖీ చేయవలసిన అవసరం అనిపించదు. 

కానీ, మీరు ఆర్థికంగా చురుకుగా ఉండి, డబ్బు విషయంలో బాధ్యతగా వ్యవహరిస్తుంటే, మీ ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేసే ప్రతి అంశం గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. కాబట్టి, మీకు మెరుగైన క్రెడిట్ రిపోర్టు అత్యంత కీలకమైంది. ఎందుకు ముఖ్యం? మీ క్రెడిట్ రిపోర్టు కేవలం బ్యాంకులకు ఉపయోగపడే ఒక సాధనం మాత్రమే కాదు. రానురాను, దీన్ని ఉద్యోగ నియామకాలలో, ముఖ్యమైన ధ్రువీకరణ తనిఖీలలో, మీ ఆర్థిక విశ్వసనీయతను అంచనా వేయడానికి వివాహ, డేటింగ్ ప్లాట్‌ఫాంలలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. శారీరక ఆరోగ్యానికి మీ అడుగులను లేదా హృదయ స్పందన రేటును గమనించడం ఎంత ముఖ్యమో, మీ ఆర్థిక ఆరోగ్యానికి ఇది కూడా అంతే ముఖ్యం. క్రెడిట్ రిపోర్ట్..మీ క్రెడిట్ ప్రయాణానికి సంబంధించిన అనేక విషయాలను తెలియజేస్తుంది. ఇందులో మీ క్రెడిట్ స్కోరు చాలా కీలకమైంది. ఇది 300 నుంచి 900 వరకు ఉండే 3 అంకెల సంఖ్య(స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే రుణం పొందే అవకాశాలు అంత ఎక్కువ). 

Source : Eenadu Telugu

1 hour ago

Home Flash News