... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి మున్సిపాలిటీల చైర్మన్ పదవులు బీఆర్ఎస్ కైవసం

ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి మున్సిపాలిటీల చైర్మన్ పదవులు బీఆర్ఎస్ కైవసం

రాష్ట్రంలో వాయిదా పడుతూ వస్తున్న ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యింది. 2026 ఏప్రిల్ 04వ తేదీన జరిగిన జరిగిన ఎన్నికలో మున్సిపాలిటీ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఆ పార్టీకి చెందిన టెకుల సుదర్శన్ రెడ్డి చైర్మన్ గా ఎన్నికయ్యారు. BRS చైర్మన్ అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ చైర్మెన్ అభ్యర్థిగా ఆకుల యాదగిరి పేరు ప్రతిపాదించగా.. బీఆర్ఎస్ అభ్యర్థి చైర్మన్ గా ఎన్నికయ్యారు. 

చైర్మన్ ఎన్నిక వాయిదా వేయాలని కాంగ్రెస్ కౌన్సిలర్లు కోరారు. ముగ్గురు కౌన్సిలర్లపై కోర్టులో కేసు కొనసాగుతుందని ఎన్నికల అధికారి దృష్టికి తెచ్చారు. అయితే కోర్టు ఆదేశాలతో ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి చెప్పారు. దీంతో ఓటింగ్ ప్రక్రియపై అభ్యంతరం తెలుపుతూ కాంగ్రెస్ వాకౌట్ చేసింది. మరోవైపు మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ పదవిని కూడా బీఆర్ఎస్ దక్కించుకుంది. మున్సిపల్ చైర్మన్ గా సంధ్యారణి ఎన్నికైంది. సీపీఐ మద్ధతుతో చైర్మన్ పదవి దక్కించుకుంది. కాంగ్రెస్ కౌన్సిలర్లు, చైర్మన్ అభ్యర్థి ఎన్నికకు దూరంగా ఉన్నారు.

Source : V6 News

1 hour ago

Home Flash News