రాజధానికి భూములిచ్చిన రైతులను అవమానిస్తారా?: మంత్రి పార్థసారథి
అమరావతి: రాజధానిపై ఏం మాట్లాడుతున్నారో వైకాపా అధినేత జగన్‌కు కనీసం అర్థమవుతుందా? అని మంత్రి కొలుసు పార్థసారథి ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుపై ప్రజలకు అపార నమ్మకం ఉందన్నారు. ఆ నమ్మకంతోనే రైతులు రాజధానికి స్వచ్ఛందంగా భూమిలిచ్చారని పేర్కొన్నారు. ‘‘రాజధానికి భూములిచ్చిన రైతులను అవమానిస్తారా..?. రాబోయే రోజుల్లో వైకాపాకు ప్రజలు పుట్టగతులు లేకుండా చేస్తారు. రాష్ట్ర బడ్జెట్ మొత్తాన్ని అమరావతికి ఖర్చు పెడుతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు’’ అని మంత్రి మండిపడ్డారు.