మమతను ఓడించేందుకు 1000 కోట్లతో కుట్ర.. టీఎంసీ బహిష్కృత నాయకుడి నోట.. బీజేపీ పథక రచన!
పశ్చిమ బెంగాల్‌లో అధికారాన్ని చేజిక్కించుకోవాలి. 15 ఏండ్లుగా రాష్ట్రంలో హవా చూపిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ని గట్టిగా దెబ్బతీయాలి. మూడు పర్యాయాలుగా సీఎంగా కొనసాగుతున్న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీని ఎలాగైనా గద్దె దించాలి. దీని కోసం రూ. వెయ్యి కోట్లు ఖర్చైనా పర్వాలేదు. అవసరమైతే, ప్రధానమంత్రి కార్యాలయమే (పీఎంవో) స్వయంగా రంగంలోకి దిగుతుంది. కోల్‌కతా, ఏప్రిల్ 10/(స్పెషల్ టాస్క్ బ్యూరో) : పశ్చిమ బెంగాల్‌లో అధికారాన్ని చేజిక్కించుకోవాలి. 15 ఏండ్లుగా రాష్ట్రంలో హవా చూపిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ని గట్టిగా దెబ్బతీయాలి. మూడు పర్యాయాలుగా సీఎంగా కొనసాగుతున్న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీని ఎలాగైనా గద్దె దించాలి. దీని కోసం రూ.
వెయ్యి కోట్లు ఖర్చైనా పర్వాలేదు. అవసరమైతే, ప్రధానమంత్రి కార్యాలయమే (పీఎంవో) స్వయంగా రంగంలోకి దిగుతుంది. మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బెంగాల్‌లో కాషాయ జెండాను ఎగురవేయడానికి బీజేపీ పెను కుట్రకు పథక రచన చేసిందా? తాజాగా బయటపడిన ఓ వీడియో ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నది.బెంగాల్‌లో మమత హవాకు అడ్డుకట్ట వేసి ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రధాని మోదీ సహా అగ్రనాయకత్వం అంతా బెంగాల్‌లోనే ఉండి మరీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నది.
ఈ క్రమంలో టీఎంసీకి మద్దతుగా ఉన్న ముస్లిం ఓటు బ్యాంకును చీల్చి బీజేపీకి లబ్ధి చేకూర్చడానికి రూ.1000 కోట్ల భారీ డీల్ కుదిరినట్టు వార్తలు రావడం సంచలనంగా మారింది. దీన్ని ధ్రువపర్చేలా ఉన్న ఓ స్టింగ్ ఆపరేషన్ వీడియోను టీఎంసీ నేతలు గురువారం బయటపెట్టారు. టీఎంసీని ఓడించడానికి ఆ పార్టీ బహిష్కృత నేత, ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ (ఏజేయూపీ) అధ్యక్షుడు హుమాయున్ కబీర్‌తో బీజేపీ.. రూ.1,000 కోట్ల డీల్ కుదుర్చుకొన్నట్టు టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు.
వీడియోలో ఏమున్నది?
టీఎంసీ విడుదల చేసిన వీడియో ప్రకారం.. బెంగాల్‌లో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీని ఓడించడానికి బీజేపీ పథక రచన చేసినట్టు హుమాయున్ కబీర్ వీడియోలోని మరో వ్యక్తితో అన్నారు. టీఎంసీ నుంచి ముస్లిం ఓట్లను మళ్లిస్తే అది బీజేపీకి లబ్ధి చేకూరుస్తుందని, దీని కోసం ఓ వ్యూహం కూడా రెడీగా ఉన్నదని పేర్కొన్నారు.