... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
తెలంగాణ ఇంటర్ సెకండియర్‌లో 70.58 శాతం పాస్.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్ పొందండి

TS Inter Results 2026 2nd Year: తెలంగాణ ఇంటర్ సెకండియర్‌లో 70.58 శాతం పాస్.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్ పొందండి

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు వచ్చేశాయి. ఏప్రిల్ 12వ తేదీ (ఆదివారం) ఉదయం 11:00 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు. హైదరాబాద్‌లోని టీజీబీఐఈ కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పబ్లిక్ అఫైర్స్ అడ్వైజర్ కె. కేశవ రావు, విద్యాశాఖ సెక్రటరీ, బోర్డు వైస్ చైర్‌పర్సన్ యోగితా రానా కలిసి జనరల్, వొకేషనల్ స్ట్రీమ్ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల కోసం వాట్సాప్ నెంబర్ సైతం ఏర్పాటు చేసినట్లు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) తెలిపింది. ఇంటర్ రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి ఇంటర్ సెకండియర్ లో 70.58 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. ఇంటర్ సెకండియర్ లో 4,11,474 మంది జనరల్ విద్యార్థులు పరీక్షలు రాయగా 3,11,112 మంది పాసయ్యారు.

 బాలికలు 1,74,136 మంది పాస్ కాగా, బాలురు 136976 మంది ఉత్తీర్ణత సాధించారు. వొకేషనల్ లో 42458 మందిలో 30872 మంది విద్యార్థులు పాసయ్యారు. జనరల్‌లో 75.61 మంది పాస్ కాగా, ఒకేషనల్‌లో 72.71 శాతం మంది పాసయ్యారని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు జరిగిన పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9.9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఇంటర్ సెకండియర్ పరీక్షలను 5.07 లక్షల మంది విద్యార్థులు రాశారు. విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి సబ్జెక్టులోనూ కనీసం 35 శాతం మార్కులు సాధించాలి. ఇంటర్ ఫలితాల విడుదల అనంతరం విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్లను సంప్రదించి తమ స్కోర్ కార్డులను చూసుకోవచ్చు. https://tgbie.in/result.html

Source : ABP Desam

3 hours ago

Home Flash News