Select Location
All Locations
State
Region
City / District
‘జన నాయగన్‌’ లీక్ ఆరుగురి అరెస్ట్‌.. చిత్రబృందం హెచ్చరిక

‘జన నాయగన్‌’ లీక్ ఆరుగురి అరెస్ట్‌.. చిత్రబృందం హెచ్చరిక

ఇంటర్నెట్‌ డెస్క్: కోలీవుడ్‌ అగ్రకథానాయకుడు విజయ్‌ నటించిన చివరి చిత్రం ‘జననాయగన్‌’ను (Jana Nayagan) పైరసీ భూతం వేధిస్తోన్న విషయం తెలిసిందే. విడుదలకు ముందే ఈ సినిమా ఆన్‌లైన్‌లో లీక్‌ కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చిత్రబృందం ఫిర్యాదుతో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రంగంలోకి దిగారు. ఆరుగురుని అరెస్ట్‌ చేశారు. దీనిపై చిత్రబృందం తరఫు లాయర్‌ పోస్ట్‌ పెట్టారు (Jana Nayagan Leak). ‘‘సినిమాను లీక్‌ చేసినందుకు సైబర్ క్రైమ్ విభాగం ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేసింది. సోషల్‌ మీడియా వేదికగా లీకైన సీన్‌లను ఏ రూపంలోనైనా డౌన్‌లోడ్‌ చేసినా, షేర్‌ చేసినా వారిపై కూడా చర్యలు తీసుకుంటాం. 

పైరసీని ఫార్వర్డ్‌ చేసిన వ్యక్తులను కూడా గుర్తించి తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని నోటీసులు విడుదల చేశారు. కొన్ని డిజిటల్‌ పరికరాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తీవ్ర ఆందోళనకు గురయ్యా: ‘జననాయగన్‌’ లీక్‌పై చిరంజీవి పోస్ట్‌ విజయ్‌ చివరి చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సెన్సార్‌ సర్టిఫికెట్‌ ప్రక్రియలో జాప్యం కారణంగా విడుదలపై క్లారిటీ రావడం లేదు. ఈ తరుణంలో సినిమా లీక్‌ కావడంపై మూవీ టీమ్‌తో పాటు ఇండస్ట్రీ మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తోంది. చిరంజీవి, కమల్‌హాసన్‌, రజనీకాంత్‌ వంటి అగ్రతారలు విజయ్‌కు మద్దతుగా నిలిచారు.


Eenadu Telugu 4 days ago
Home Flash News