Aadhaar Card | చెత్తలో కుప్పలు తెప్పలుగా ఆధార్ కార్డులు.. మెదక్ జిల్లాలో కలకలం
Aadhaar Card | బ్యాంక్ అకౌంట్‌లో నుంచి డబ్బులు తీయాలంటే ఏటీఎం కార్డు కావాలి.. డబ్బులు ట్రాన్సక్షన్ జరపాలంటే పాన్ కార్డు అవసరం.. ఇక ఆధార్ కార్డు అయితే అన్నింటికీ అదే ఆధారం. మన జీవితంలో అత్యంత కీలకమైన ఈ కార్డులను ఎంతో జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. కానీ అత్యంత భద్రంగా దాచుకోవాల్సిన ఆధార్ కార్డులు, పాన్‌కార్డులు, ఏటీఎం కార్డులు ఇప్పుడు చెత్తకుప్పలో దర్శనమిచ్చాయి.
మెదక్ జిల్లా కౌడిపల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఇలా కుప్పలు తెప్పలుగా ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఇన్సూరెన్స్, ఎంవోయూ పత్రాలు చెత్తలో కనిపించడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తు్న్నారు. ఆ గ్రామానికి చెందిన పోస్టుమ్యాన్ ఇలా వాటిని పంచకుండా.. మితిమీరిన నిర్లక్ష్యంతో పారేశాడని తెలిసి మండిపడుతున్నారు. ముఖ్యమైన పత్రాలను డెలవరీ చేయకుండా చెత్తకుప్పలో పడేసిన పోస్టల్ శాఖ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.