... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
మహిళా రిజర్వేషన్ బిల్లు... 21వ శతాబ్దంలోనే కీలక నిర్ణయం:

మహిళా రిజర్వేషన్ బిల్లు... 21వ శతాబ్దంలోనే కీలక నిర్ణయం: పీఎం మోడీ

మహిళా రిజర్వేషన్ బిల్లు 21వ శతాబ్దంలోనే కీలక నిర్ణయమని అన్నారు పీఎం మోడీ. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో నిర్వహించిన నారీశక్తి వందన సమ్మేళనం కార్యక్రమంలో మాట్లాడుతూ ఈమేరకు వ్యాఖ్యలు చేశారు మోడీ. చట్టసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఏప్రిల్ 16న పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమవుతోందని అన్నారు. మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నామని.. ఈ బిల్లు ద్వారా కొత్త చరిత్ర లికించబోతున్నామని అన్నారు మోడీ.
దేశాభివృద్ధిలో మహిళలది కీలక పాత్ర అని.. మహిళల భాగస్వామ్యంతో వ్యవస్థ బలోపేతమవుతుందని అన్నారు మోడీ. నారీశక్తికి పంచాయితీరాజ్ ఒక ఉదాహరణ అని అన్నారు. సామజిక న్యాయం ఇప్పుడు కేవలం నినాదం కాదని.. మహిళల కలలకు రెక్కలు తొడుగుతున్నామని అన్నారు. దేశంలో రాష్ట్రపతి, ఆర్ధికమంత్రి వంటి కీలక పదవుల్లో మహిళలు ఉన్నారని అన్నారు మోడీ. కొత్త బిల్లులపై దేశవ్యాప్తంగా మహిళలు చర్చిస్తున్నారని అన్నారు మోడీ.మహిళా రిజర్వేషన్ బిల్లుకు 2023లో అన్ని పార్టీలు మద్దతిచ్చాయని.. ఈ నెల 16 నుంచి ఈ బిల్లుపై పార్లమెంట్ చర్చిస్తోందని అన్నారు మోడీ.

Source : V6 News

1 hour ago

Home Flash News