Select Location
All Locations
State
Region
City / District
అడి షనల్ డీజీ మహేశ్‌‌‌‌ భగవత్‌‌‌‌ కు మంగ్లీ ఫిర్యాదు

అడి షనల్ డీజీ మహేశ్‌‌‌‌ భగవత్‌‌‌‌ కు మంగ్లీ ఫిర్యాదు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: స్కామ్‌‌‌‌ల పేరుతో తనపై చేస్తున్న తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాలని సింగర్‌‌‌‌‌‌‌‌ మంగ్లీ అలియాస్ సత్యవతి అడిషనల్ డీజీపీ(లా అండ్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌) మహేశ్‌‌‌‌ భగవత్‌‌‌‌ను కోరారు. స్కామ్‌‌‌‌ల పేరుతో తనను అప్రతిష్టపాలు చేయడంతో పాటు తప్పుడు కేసులు పెడుతున్నారని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బుధవారం ఫిర్యాదు చేశారు. అనంతరం డీజీపీ ఆఫీస్ బయట మీడియాతో మాట్లాడుతూ.. అబద్ధపు కేసులతో కొంతమంది తనను వేధిస్తున్నారని, తనకు పాటలు తప్ప, స్కామ్‌‌‌‌లు తెలియవన్నారు. తప్పు చేసుంటే ఎలాంటి శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. పేదరికం నుంచి వచ్చిన తనకు.. డబ్బు విలువ తెలుసని పేర్కొన్నారు. నెల రోజులుగా తన ప్రోగ్రామ్‌‌‌‌లు, రికార్డింగ్స్ వదులుకున్నానని తెలిపారు.

సుభాక్షేత్ర బిజినెస్ అనే పేరుతో కంపెనీ ఏర్పాటు చేసి ఎండీగా ఉన్న మధు.. ప్రస్తుతం బాధితుడిగా మీడియాతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. హిమాకాంత్ రెడ్డి అనే వ్యక్తి ఆ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా ఉన్నాడని తెలిపారు. మంగ్లీని వేధిస్తున్న మధు నాయక్, హిమాకాంత్ రెడ్డి, రమావత్ మధు, సిద్ధు, అడ్వకేట్‌‌‌‌ సుబ్బారావుపై డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. నేరగాళ్లే మీడియా ముందుకొచ్చి బాధితులుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.


V6 News 1 hour ago
Home Flash News