రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి : సీపీ గౌష్ ఆలం
కరీంనగర్ క్రైం, వెలుగు: వాహనదారులు ప్రతిఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం సూచించారు. శుక్రవారం శాతవాహన యూనివర్సిటీలో ‘అరైవ్ అలైవ్’ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం యువతే ప్రాణాలు కోల్పోతున్నారని, దీనిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ డిఫెన్సివ్ డ్రైవింగ్ అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్రమాదం జరిగిన బాధితులను ఆసుపత్రికి చేర్చిన వారికి ప్రభుత్వం రూ. 25 వేల బహుమతి అందజేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో వర్సిటీ వీసీ ఉమేశ్‌కుమార్, ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్, సీఐ కోటేశ్వర్, రిజిస్ట్రార్ సతీశ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.