నో హెల్మెట్.. నో ఎంట్రీ!
మంచిర్యాల, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా వివిధ గవర్నమెంట్ ఆఫీసుల్లో పని చేసే అధికారులు, సిబ్బంది బైక్‌లపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పోలీసు శాఖ పిలుపునిచ్చింది. ఈ మేరకు గురువారం అరైవ్ అలైవ్‌లో భాగంగా అన్ని ప్రభుత్వ ఆఫీసులతో పాటు పోలీస్స్టేషన్లలో అవేర్నెస్ ప్రోగ్రాంలు నిర్వహించారు. హెల్మెట్ పెట్టుకోని వారికి ఆఫీసుల్లోకి ప్రవేశం లేదంటూ నో హెల్మెట్,నో ఎంట్రీ స్లోగన్లు చేస్తూ.. ప్లకార్డులు ప్రదర్శించారు.
చెన్నూర్ తహసీల్దార్ ఆఫీస్‌లో సీఐ బన్సీలాల్ ఆధ్వర్యంలో జరిగిన ప్రోగ్రాంలో కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ ఆధ్వర్యంలో డీసీపీ ఆఫీస్‌లో నో హెల్మెట్ నో ఎంట్రీ ప్రోగ్రాం నిర్వహించారు. డీసీపీ ఆఫీస్‌తో పాటు పోలీస్ స్టేషన్లలో పని చేసే సిబ్బంది హెల్మెట్ లేకుండా వస్తే లోపలికి అనుమతించబోమని స్పష్టం చేశారు. పెట్రోల్ బంకుల్లోనూ బోర్డులు పెట్టారు.