మరోసారి మంచి మనసు చాటుకున్న చిరంజీవి
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ నటుడు చిరంజీవి (Chiranjeevi) మరోసారి మంచి మనసు చాటుకున్నారు. ఆపదలో ఉన్న తన సిబ్బందిని ఆర్థిక సాయంతో ఆదుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. మేకప్ ఆర్టిస్ట్ శివనాథ్ హార్ట్ సర్జరీ కోసం రూ.10.5 లక్షలు, మాజీ మేనేజర్ నరసయ్య సతీమణి బైపాస్ సర్జరీకి రూ.9.5 లక్షలు అందజేశారు. సాయం చేయడమే కాదు శస్త్ర చికిత్సల ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి, ఆ కుటుంబాలకు అండగా నిలిచారు.తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తనకు అందజేసిన ఎన్టీఆర్ నేషనల్ అవార్డు నగదు బహుమతి రూ. 10 లక్షలని చిరంజీవి పలు సేవా సంస్థలకు విరాళంగా ఇచ్చారు. కొవిడ్, వరదలు.. ఇలా విపత్కర సమయాల్లో బాధితులకు అండగా నిలిచారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్‌ల ద్వారా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన సంగతి తెలిసిందే.