Select Location
All Locations
State
Region
City / District
Prakash Raj: శ్రీరాముడిపై కామెంట్స్.. ప్రకాశ్ ‍రాజ్‌పై బ్యాన్‌..!

Prakash Raj: శ్రీరాముడిపై కామెంట్స్.. ప్రకాశ్ ‍రాజ్‌పై బ్యాన్‌..!

దక్షిణాది విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్‌ ఏదో ఒక వివాదంలో వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఆయన శ్రీరాముడిని ఉద్దేశించి తీవ్ర వివాదానికి దారితీశాయి. ఆయన కామెంట్స్‌పై వ్యతిరేకత రావడంతో వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ఈ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మరింత ముదిరేలా కనిపిస్తోంది.

ప్రకాశ్‌ రాజ్‌ను సినీ ఇండస్ట్రీ నుంచి బ్యాన్‌ చేయాలనే డిమాండ్‌ తెరపైకి వస్తోంది. శ్రీరాముడిపై చేసిన కామెంట్స్‌తో ఆయనపై పలువురు నెటిజన్స్ మండిపడుతున్నారు. దీంతో ఆయనపై నిషేధం విధించాలనే డిమాండ్స్‌ రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. సినీ వర్గాలు సైతం ప్రకాశ్ ‍రాజ్‌పై ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ప్రకాశ్ రాజ్‌ తన చేసిన కామెంట్స్‌పై వివరణ ఇచ్చినప్పటికీ వ్యతిరేకత ఏమాత్రం తగ్గడం లేదు. 

అయితే కొందరు దర్శకులు, నటులు మాత్రం ఈ విషయంపై పునరాలోచన చేయాలంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. గతంలో కూడా ఆయనపై ఇండస్ట్రీలో వివాదాలు ఉన్నాయని.. అప్పట్లో తాత్కాలికంగా బ్యాన్ జరిగిన సంఘటనలు కూడా తాజాగా గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ టాపిక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.


Sakshi 1 hour ago
Home Flash News