Select Location
All Locations
State
Region
City / District
శిథిలాల నుంచి వస్తువుల వెలికితీతకు సహకరించండి : హైకోర్టు

శిథిలాల నుంచి వస్తువుల వెలికితీతకు సహకరించండి : హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: సంగారెడ్డి జిల్లా అమీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలం ఐలాపూర్ కూల్చివేతల వ్యవహారంలో అధికారుల అత్యుత్సాహంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. వస్తువులను తీసుకెళ్లడానికి కనీసం సమయం ఇవ్వకపోవడం ఏమిటి? అని ప్రశ్నించింది. బాధితులకు సహకరించాలని ఆదేశించింది. ఐలాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హైడ్రా చేపట్టిన కూల్చివేతలను సవాల్ చేస్తూ 98 ఏళ్ల రైతు ఎం.ఎ.షరీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బి.విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి విచారించారు.

పిటిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరఫు న్యాయవాది వాదిస్తూ.. హైడ్రా అధికారులు తెల్లవారుజామున 4:30 గంటలకే కూల్చివేతలు మొదలుపెట్టి, ఇంట్లోని విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు కూడా తీసుకోవడానికి అవకాశం ఇవ్వలేదని తెలిపారు. వస్తువులను తీసుకెళ్లడానికి కాస్త అవకాశం కూడా ఇవ్వకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోయామన్నారు. శిథిలాల కింద ఉన్న వస్తువులను తీసుకోవాల్సిన అవసరం ఉందని, లేకుంటే అవి పాడై మరింత నష్టం జరుగుతుందని చెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. పిటిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వస్తువులను తీసుకెళ్లడానికి అనుమతించాలని, అంతేగాకుండా ఈ ప్రక్రియలో అవసరమైన సహకారం అందించాలంటూ అమీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తహసిల్దార్, సహాయ పోలీసు కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు ఆదేశాలు జారీ చేశారు.


V6 News 1 hour ago
Home Flash News