వీసా దరఖాస్తులు.. భారతీయులకు కెనడా ఊరట
ఇంటర్నెట్‌డెస్క్: భారతీయ వీసా దరఖాస్తుదారులకు కెనడా ప్రభుత్వం ఊరట కల్పించింది (Indian visa applicants). తాత్కాలిక నివాస దరఖాస్తులతో పాటు విజిటర్స్, స్టడీ పర్మిట్స్, సూపర్ వీసా ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గిస్తూ మరింత వేగవంతం చేసింది. ఈమేరకు ఆ దేశ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ తాజాగా వివరాలు వెల్లడించింది. విజిటర్ వీసాల ప్రాసెసింగ్‌ను 37 రోజుల నుంచి 23 రోజులకు, స్టడీ పర్మిట్ వీసా 4 వారాల నుంచి 3 వారాలకు, సూపర్ వీసా ప్రాసెసింగ్‌ను 202 రోజుల నుంచి 182 రోజులకు తగ్గించింది. తాత్కాలిక వీసా కేటగిరీల్లో మెరుగుదలను ఈ గణాంకాలు వెల్లడి చేస్తున్నాయి. దరఖాస్తుల సంఖ్య, రకం, పనిభారాన్ని బట్టి ఈ ప్రాసెసింగ్ సమయంలో మార్పు ఉంటుందని కెనడా అధికారులు (Canada) వెల్లడించారు.