నేను ట్రావిస్ హెడ్‌ను అడిగిన మొదటి ప్రశ్న అదే: అభిషేక్ శర్మ
ఇంటర్నెట్ డెస్క్: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్, ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ తన బ్యాటింగ్ శైలిని ట్రావిస్ హెడ్ ఎలా ప్రభావితం చేశాడో వెల్లడించాడు. హెడ్ అగ్రెసివ్ మైండ్‌సెట్ ఐపీఎల్‌లో తన ఆటను ఏ విధంగా తీర్చిదిద్దిందో అభిషేక్ తెలిపాడు. ‘‘ట్రావిస్ హెడ్ సన్‌రైజర్స్‌లో చేరడానికి ఏడాదిన్నర ముందు నుంచే అతని ఆటను గమనిస్తున్నా. అతను నా సహచరుడిగా మారినప్పుడు నేను చాలా సంతోషించాను. నేను హెడ్‌ని అడిగిన మొదటి ప్రశ్న అతని బ్యాటింగ్ ఆలోచనా విధానం గురించే. అతను మూడు ఫార్మాట్లలోనూ రాణించి బౌలింగ్‌పై ఆధిపత్యం చెలాయించే తీరు నచ్చింది. అతను నాతో తన ప్రణాళిక చాలా సింపుల్ అని చెప్పాడు. బంతిని నిశితంగా గమనించాలన్నాడు. ఒకవేళ మొదటి బంతిని కొట్టగలనని అనిపిస్తే వెంటనే ప్రయత్నించాలన్నాడు.
ఐపీఎల్‌కు ముందు నా ప్రాక్టీస్‌లో హెడ్ ఇచ్చిన సలహాలను పాటించా. ఇప్పుడు వాటిని అనుసరిస్తున్నాను’’ అని అభిషేక్ వివరించాడు. నేను ఇంకా చాలా చిన్నవాడినే.. వైభవ్‌తో ఓపెనింగ్‌పై యశస్వి ఐపీఎల్‌లో తన అనుభవం గురించి కూడా అభిషేక్ మాట్లాడాడు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ క్రికెటర్లందరినీ ఈ టోర్నీ ఒకచోట చేర్చుతుంది. ఇది అగ్రశ్రేణి టీ20 లీగ్. ఇక్కడ ఆడే అవకాశం లభించడం ఒక అదృష్టంగా భావిస్తాను. అగ్రశ్రేణి ఆటగాళ్లతో కలిసి ఆడటం, ఇతర జట్లలో ఉన్న గొప్ప ప్లేయర్లతో తలపడటం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు’ అని అభిషేక్ పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో అభి.. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడి ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. వైభవ్ సూర్యవంశీ (400) తర్వాత సెకండ్ లీడింగ్ స్కోరర్ (380 రన్స్)గా ఉన్నాడు.