రోహిత్.. ఇంకెప్పుడు?
ముంబయి: సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో అయినా రోహిత్ శర్మ బరిలోకి దిగుతాడని ఆశించిన అభిమానులకు ఎదురుచూపులే మిగిలాయి. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ అతను బరిలోకి దిగలేదు. ఏప్రిల్ 12న ఆర్సీబీతో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా తొడకండరాల గాయానికి గురైన రోహిత్.. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌కు ముందు ముంబయి జట్టుతో పాటు ట్రైనింగ్‌లోనూ పాల్గొన్నాడు. అయితే టాస్ సమయంలో కెప్టెన్ హార్దిక్ పాండ్య రోహిత్ పునరాగమనంపై స్పష్టత ఇచ్చాడు.
అతను ఫిట్‌నెస్ సాధించే పనిలో ఉన్నాడని, మరో రెండు మ్యాచ్‌లకూ అందుబాటులో ఉండకపోవచ్చని తెలిపాడు. ఈ మ్యాచ్‌కు తుది జట్టులో ముంబయి చాలానే మార్పులు చేసింది. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడాడు. రికెల్టన్, బౌల్ట్ పునరాగమనం చేశారు. రాబిన్ మింజ్ కూడా అవకాశం అందుకున్నాడు. క్వింటన్ డికాక్, శాంట్నర్ గాయాలతో దూరం కాగా.. రూథర్‌ఫర్డ్, క్రిష్ భగత్, డానిష్ మాలేవర్ జట్టులో చోటు కోల్పోయారు.