Select Location
All Locations
State
Region
City / District
Urvashi Rautela: షూటింగ్ సెట్స్‌లో బాలయ్య అసలు స్వరూపం ఇదే.. క్లారిటీ ఇచ్చిన ఊర్వశి!

Urvashi Rautela: షూటింగ్ సెట్స్‌లో బాలయ్య అసలు స్వరూపం ఇదే.. క్లారిటీ ఇచ్చిన ఊర్వశి!

నందమూరి బాలకృష్ణ అంటే కేవలం వెండితెరపై గర్జించే సింహం మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్ నిలిచే ఒక సెన్సేషన్. బాలయ్య తన సినిమాల కంటే ఎక్కువగా బహిరంగ సభల్లో ఆయన ప్రవర్తన, వైరల్ వీడియోలు నెట్టింట తెగ చర్చకు దారితీస్తుంటాయి. గత ఏడాది బాబీ దర్శకత్వంలో వచ్చిన ‘డాకు మహారాజ్’ సినిమాతో బాలయ్య వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా ఈ చిత్రంలోని ‘డబిడి దిబిడి’ సాంగ్ చుట్టూ సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరిగింది. ఈ నేపథ్యంలో ఆ చిత్రంలో నటించిన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా బాలయ్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఊర్వశి తాను నటించిన ‘డాకు మహారాజ్’ వివాదంపై స్పందించింది. సోషల్ మీడియాలో చిన్నగా మొదలైన చర్చ ఒక్కసారిగా పెద్దదిగా మారిపోయింది.. ముఖ్యంగా ‘డబిడి దిబిడి’ పాటలోని కొరియోగ్రఫీ, బాలయ్య - ఊర్వశి మధ్య ఉన్న వయస్సు వ్యత్యాసంపై నెటిజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అయితే అది సినిమా కథనంలో భాగంగానే అని ఆమె క్లారిటీ ఇచ్చారు. అయితే, నెగెటివిటీ ఎంత ఉన్నా, సినిమా కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో ఆ పాటను ఫైనల్ కట్‌లో అలాగే ఉంచారు.

బయట వినిపించే మాటలకు, సెట్స్‌లో బాలయ్య ప్రవర్తనకు అస్సలు సంబంధం లేదని ఊర్వశి వెల్లడించింది. బాలకృష్ణతో పనిచేయడం ఒక అద్భుతమైన అనుభవం. ఆయన సెట్స్‌లో చాలా సరదాగా, ఉత్సాహంగా ఉంటారు. ఆయనలో ఒక చిన్నపిల్లాడి లాంటి మనస్తత్వం ఉంది. చాలామంది ఆయనను చూసి భయపడతారు కానీ, ఒక్కసారి మాట్లాడితే ఆయన ఎంత గ్రౌండెడ్ అనేది అర్థమవుతుంది. గత ఏడాది వాలెంటైన్స్ డే నాడు తనకు మొదటి విషెస్ చెప్పింది బాలయ్యేనని ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంది.

ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు నెక్స్ట్ లెవల్‌లో ఉంటాయని ఊర్వశి చెప్పుకొచ్చారు. బాలయ్య ఎనర్జీకి తాను కూడా ఫిదా అయ్యానని, ముఖ్యంగా ఫైట్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తాయని పేర్కొంది. మొత్తానికి వివాదాలు ఎన్ని ఉన్నా, ‘నటసింహం’ ఎనర్జీని చూసి ఊర్వశి ముగ్ధురాలైపోయింది. ‘డబిడి దిబిడి’ సాంగ్ వివాదాస్పదమైనా, బాలయ్య ఇమేజ్ వల్ల అది మాస్ ఆడియన్స్‌లో మాత్రం బాగానే రీచ్ అయింది. తెరపై ఆయన గంభీరంగా కనిపించినా, నిజ జీవితంలో మాత్రం ఆయన ఒక 'అన్ స్టాపబుల్' ఎనర్జీ అని ఊర్వశి మాటల ద్వారా మరోసారి స్పష్టం చేసింది.


V6 News 1 hour ago
Home Flash News