ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇంటికెళ్లి పలకరించిన ప్రధాని
ఈనాడు, అమరావతి: ‘సుదీర్ఘకాలం మీరు ప్రజాజీవనంలో ఉండాలి. మీపై ఎంతో బాధ్యత ఉంది. రాజకీయాల్లో, ప్రజాజీవనంలో ఉండే మనం ఆరోగ్యాన్ని శ్రద్ధగా కాపాడుకోవాలి’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో అన్నారు. ప్రధాని హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఆదివారం జూబ్లీహిల్స్‌లోని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాసానికి వచ్చారు. పవన్, ఆయన సతీమణి అనా కొణిదెల ప్రధానికి సాదర స్వాగతం పలికారు. పవన్ ఆయన చేయిపట్టుకుని ఇంట్లోకి తోడ్కొని వెళ్లారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పవన్‌ను అందుకు కారణాలేమిటని ప్రధాని ఆరా తీశారు. ‘కొన్నేళ్లుగా చేసిన పర్యటనల్లో రేగిన దుమ్ము, ధూళి సైనస్‌లోకి చేరాయి. అవి ఒక గట్టి బాల్ మాదిరిగా మారిపోయి ఇబ్బంది కలిగించాయి. ఇన్‌ఫెక్షన్ అయింది. కంటిపైనా ప్రభావం చూపింది. దీంతో ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ చేశారు’ అని పవన్ వివరించారు.ణిదెల కూడా హిందీలో మాట్లాడాలి’ అని అన్నారు.
ఇంకా ఏమైనా ఆరోగ్య సమస్యలున్నాయా అని మోదీ అడిగారు. ‘గతంలో సినిమా షూటింగ్‌ల సమయంలో భుజాల దగ్గర కండరాలకు తగిలిన గాయాలు ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాయి. రొటేటర్ కఫ్ ఇంజురీ అని వైద్యులు చెప్పారు. వాటికీ శస్త్రచికిత్సలు అవసరం. స్పైనల్ కార్డుకు సంబంధించి సమస్య ఉంది’ అని పవన్ చెప్పారు. ‘మీరు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దు. సమాజానికి మీరు చేయాల్సింది ఎంతో ఉంది’ అంటూ మోదీ ఆయనకు పలు ఆరోగ్య సూచనలు చేశారు. మార్క్.. నీ గురించి ఎంతో కంగారుపడ్డాం పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రధానికి తాను తయారు చేసిన స్వాగత కార్డు, ధన్యవాదాల కార్డు అందించారు. మోదీ ఆ బాబును దగ్గరకు తీసుకున్నారు. ‘నీ కోసం అప్పుడు ఎంత కంగారుపడ్డామో తెలుసా’ అంటూ గతంలో సింగపూర్‌లో వేసవి శిక్షణ శిబిరంలో అగ్నిప్రమాదంలో అతను చిక్కుకున్న క్షణాలను గుర్తు చేసుకున్నారు. తర్వాత పవన్ సతీమణి అనా కొణిదెలతో ప్రధాని మాట్లాడారు. వీరి మధ్య కొన్ని రష్యన్ పదాలు కూడా దొర్లాయి. ప్రధానిగా తాను ప్రమాణస్వీకారం చేసినప్పుడు పవన్‌తో పాటు అనా వచ్చిన సందర్భాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
అకీరా.. ఏం చేస్తున్నావ్? తర్వాత పవన్ కుమారుడు అకీరానందన్‌తో ప్రధాని మాట్లాడారు. ఏం చేస్తున్నావని అడగ్గా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నట్లు అకీరా చెప్పారు. మీ నాన్నలా నువ్వు కూడా అదే వైపు ఎందుకు, వేరే ప్రయత్నించాల్సింది కదా అని మోదీ వ్యాఖ్యానించారు. స్పోర్ట్స్, షూటింగ్ అంశాల్లోనూ శిక్షణ తీసుకుంటున్నానని అకీరా చెప్పారు. ప్రఖ్యాత హిందీ కవి రాంధారి సింగ్ దినకర్ కవిత్వాన్ని అకీరా ప్రధానికి వినిపించి ఆ అర్థం కూడా హిందీలోనే విశ్లేషించి చెప్పారు. ఆ హిందీ కఠినమైనదని, అది చెప్పడంతో పాటు దాని అర్థం కూడా అంతే చక్కని హిందీలో వివరించినందుకు ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. పవన్ కుమార్తె ఆద్యతోనూ మాట్లాడారు. ఆద్య అమ్మమ్మకు గుజరాతీ మూలాలున్నాయి. వీరి మధ్య అందుకు సంబంధించి కొద్దిసేపు చర్చ జరిగింది. పవన్ మరో కూతురు పొలినా అంజనాతో ప్రధాని ఇంగ్లిష్‌లో మాట్లాడారు. హిందీ తెలియదా అని ప్రశ్నించారు. ‘మళ్లీ మనం కలిసేనాటికి పొలినా, అనా కొ