Select Location
All Locations
State
Region
City / District
Jana Nayagan : దళపతి విజయ్ 'జననాయగన్' రిలీజ్ డేట్ ఫిక్స్.. క్లారిటీ ఇచ్చిన KVN ప్రొడక్షన్స్ నిర్మాత!

Jana Nayagan : దళపతి విజయ్ 'జననాయగన్' రిలీజ్ డేట్ ఫిక్స్.. క్లారిటీ ఇచ్చిన KVN ప్రొడక్షన్స్ నిర్మాత!

కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో అడుగుపెట్టడానికి ముందు నటించిన చివరి చిత్రం 'జననాయగన్' . సెన్సార్ వివాదం, కోర్టు కేసులతో వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఈ మోస్ట్ అవేటెడ్ సినిమా రిలీజ్ డేట్‌పై ఎట్టకేలకు ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. రాబోయే రెండు వారాల్లోనే ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతున్నట్లు నిర్మాత అధికారికంగా ప్రకటించారు.

తమిళనాడు సీఎం విజయ్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరైన KVN ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కె. నారాయణ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఈ సినిమా సెన్సార్ (CBFC) పనులు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయని తెలిపారు. చివరి రౌండ్ చర్చలు జరుగుతున్నాయి. దాదాపు 14 రోజుల్లో 'జననాయగన్' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అని ఆయన స్పష్టం చేశారు. విజయ్ ఎంతో క్రమశిక్షణ, అంకితభావం ఉన్న వ్యక్తి. చెప్పిన మాట నిలబెట్టుకుంటారు . తమిళనాడులో ఆయన నేతృత్వంలో సరికొత్త శకం ప్రారంభమైంది. ప్రజల కోసం ఆయన నిజమైన ప్రజా నాయకుడుగా మారారు అని కొనియాడారు.

టాలెంటెడ్ డైరెక్టర్ హెచ్. వినోద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో భారీ తారాగణం నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్‌గా నటిస్తుండగా.. పూజా హెగ్డే, ప్రియమణి, మమితా బైజు, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ బాణీలు, సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.


V6 News 46 minutes ago
Home Flash News