Select Location
All Locations
State
Region
City / District
Lenin | ‘లెనిన్’లో స్పెషల్ ఎపిసోడ్ .. అఖిల్ సినిమా కోసం దర్శకుడి భారీ ప్లాన్!

Lenin | ‘లెనిన్’లో స్పెషల్ ఎపిసోడ్ .. అఖిల్ సినిమా కోసం దర్శకుడి భారీ ప్లాన్!

Lenin | అక్కినేని యువ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం తన కెరీర్‌లో ఎంతో కీలకంగా భావిస్తున్న ‘లెనిన్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేస్తోంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్ యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. సమాచారం ప్రకారం.. ‘లెనిన్’ సెకండ్ హాఫ్‌లో ఓ ప్రత్యేకమైన ఎపిసోడ్ ఉండబోతుందట. ఈ ఎపిసోడ్ కోసం దర్శకుడు ప్రత్యేకంగా ఓ పవర్‌ఫుల్ పాత్రను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గత షెడ్యూల్‌లో ఈ సన్నివేశాలకు సంబంధించిన కొన్ని కీలక సీన్స్ కూడా చిత్రీకరించినట్లు సమాచారం.

అయితే ఆ స్పెషల్ రోల్‌లో ఎవరు నటిస్తున్నారు అన్నది మాత్రం ఇంకా సస్పెన్స్‌గా ఉంచారు. ఈ పాత్రకు ఓ ప్రముఖ నటుడిని తీసుకున్నారనే టాక్ వినిపిస్తుండగా.. మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ స్పెషల్ క్యారెక్టర్ కథలో కీలక మలుపు తీసుకురానుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతుండటం మరో విశేషం. రాయలసీమ రాజకీయాలు, భావోద్వేగాలు, యాక్షన్ ఎలిమెంట్స్‌తో కథ చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని సమాచారం. ముఖ్యంగా అఖిల్ అక్కినేని ఈ సినిమాలో పూర్తిగా కొత్త లుక్, మాస్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. అఖిల్ – భాగ్యశ్రీ జోడీకి సంబంధించిన లవ్ ట్రాక్ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు, ఎమోషనల్ కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని మూవీ టీమ్ నమ్మకంగా ఉందట. ఇప్పటికే వరుస ఫ్లాప్స్ తర్వాత మంచి కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ అక్కినేని ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కథ, క్యారెక్టర్, యాక్షన్ ఎలిమెంట్స్ అన్నీ తన కెరీర్‌కు కొత్త టర్నింగ్ పాయింట్ అవుతాయని భావిస్తున్నాడట. మూవీ అవుట్‌పుట్ కూడా చాలా బాగా వస్తోందని యూనిట్ సభ్యులు చెబుతున్నారని సమాచారం. ఇక దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి కూడా ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు బలమైన భావోద్వేగాలకు కూడా సినిమాలో పెద్దపీట వేసినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ‘లెనిన్’పై అక్కినేని అభిమానుల్లో రోజురోజుకీ ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమాతో అయినా అఖిల్ అక్కినేని భారీ హిట్ అందుకుంటాడా? అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.


Smacy News 43 minutes ago
Home Flash News