Select Location
All Locations
State
Region
City / District
Bandi Sai Bageerath | బండి సాయి భగీరథ్‌ కేసు విచారణపై సిట్‌ ఏర్పాటు

Bandi Sai Bageerath | బండి సాయి భగీరథ్‌ కేసు విచారణపై సిట్‌ ఏర్పాటు

Bandi Sai Bageerath | ఓ బాలికపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కొడుకు బండి సాయి భగీరథ్‌ లైంగికదాడి యత్నం చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో బండి సాయి భగీరథ్‌పై హైదరాబాద్‌ నగరంలోని పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రం సెక్సువల్‌ అఫెన్సెస్‌) కేసు కూడా నమోదైంది.

కేంద్ర మంత్రి అయి ఉండి తన కుమారుడు బాలికపై చేసిన అఘాయిత్యాన్ని చూస్తూ కుమారుడిని కాపాడుతున్న బండి సంజయ్ ని సైతం వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని, అతడి కుమారుడిని అరెస్టు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో బండి సాయి భగీరథ్‌పై కేసుకు సంబంధించి విచారణ కోసం రాష్ట్రప్రభుత్వం మాదాపూర్ డీసీపీ (కూకట్‌పల్లి జోన్-సైబరాబాద్) రితిరాజ్ నేతృతంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసింది. డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేయగా.. బండి సాయిభగీరథ్‌ కేసును డీసీపీ రుతిరాజ్ టీం విచారణ చేయనున్నది.

కాగా సీఎం రేవంత్ రెడ్డి 3 రోజుల తరువాత బండి సంజయ్ కొడుకు POCSO కేసు మీద స్పందించి.. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బండి భగీరథ్‌పైన నమోదు కేసుపై తక్షణమే విచారణ మొదలు పెట్టాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారని తెలిసిందే.


Smacy News 50 minutes ago
Home Flash News