తిరుమలలో భక్తుల రద్దీ ..22 కంపార్ట్మెంట్లలో దర్శనం కోసం ఎదురుచూపులు..స్వామి దర్శనానికి ఎంత సమయమంటే..!
తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతూ కొనసాగుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో దర్శనానికి ఎక్కువ సమయం పడుతోంది. ఇక నిన్న ( మే 11) ఒక్క రోజులోనే 78 వేల 985 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అదే సమయంలో 33 వేల 761 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల నుంచి స్వామివారి హుండీకి భారీగా కానుకలు అందాయి. నిన్న హుండీ ఆదాయం రూ.3.55 కోట్లుగా నమోదైంది.