రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. వరి కనీస మద్దతు ధర రూ. 2వేల 441
కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. గురువారం (మే13)న ప్రధాని మోదీ అద్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో 2026-27 సంవత్సరానికి గాను ఖరీఫ్ సీజన్ లో14 పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయించారు. వరి ధాన్యం క్వింటాల్ కనీస మద్దతు ధర రూ. 2వేల 441 గా నిర్ణయించారు. వరి ఏ గ్రేడ్ కు రూ. 2వేల 461 ధర నిర్ణయించారు. మరోవైపు క్వింటాల్ జొన్నల MSP కూడా పెంచారు. క్వింటాల్ కు కనీస మద్దతు ధర రూ. 4వేల 023 గా ప్రకటించారు. క్వింటాల్ సజ్జలకు కనీస మద్దతు ధర రూ. 2వేల 900 గా ధర ప్రకటించారు.
రైతులు పండించిన పంటలకు లాభదాయకమైన ధరలు అందేలా చూసేందుకు, కేంద్ర ప్రభుత్వం 2026-27 మార్కెటింగ్ సీజన్ కోసం ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర (MSP)ను పెంచింది. గత సంవత్సరంతో పోలిస్తే MSPలో అత్యధిక పెంపును పొద్దుతిరుగుడు విత్తనాలకు క్వింటాల్‌కు రూ.622 మద్దతు ధర ప్రకటించింది. ఆ తర్వాత పత్తి క్వింటాల్‌కు రూ. 557, నైజర్ సీడ్ క్వింటాల్‌కు రూ. 515, నువ్వులకు క్వింటాల్‌కు రూ.500 పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.