అల్లు అర్జున్ సరసన మళ్లీ పూజా హెగ్డే.. టాలీవుడ్ హ్యాట్రిక్ కాంబో రిపీట్!
వరుస సినిమాలతో ఫుల్ జోరులో ఉన్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ (Raaka) సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. అంతే కాదు కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో మరో భారీ ప్రాజెక్ట్‌ను లైన్‌లో ఉంది. #AA23 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఒక అదిరిపోయే టాక్ ఒకటి ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ క్రేజీ అప్‌డేట్స్ అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది.
ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో అల్లు అర్జున్ సరసన హీరోయిన్‌గా టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేను పరిశీలిస్తున్నట్లు సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘దువ్వాడ జగన్నాథమ్’ (DJ), ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ఇప్పుడు లోకేష్ మార్క్ యాక్షన్ డ్రామాలో కూడా ఈ హిట్ జోడీనే రిపీట్ చేసి హ్యాట్రిక్ కొట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పూజాతో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ‘యాంథమ్’ సోషల్ మీడియాను ఊపేయగా.. పూజా ఎంట్రీ వార్తతో సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది.
ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ పనులతో పాటు స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. అల్లు అర్జున్ ‘రాకా’ షూటింగ్ పూర్తి చేసిన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఎల్‌సీయూ (LCU) లాంటి యూనివర్స్‌తో ట్రెండ్ సెట్ చేసిన లోకేష్, ఐకాన్ స్టార్‌ను ఎలాంటి ఊరమాస్ రోల్‌లో చూపిస్తారోనని ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు.