Select Location
All Locations
State
Region
City / District
పెరిగిన అమూల్‌‌, మదర్ డెయిరీ పాల ధరలు

పెరిగిన అమూల్‌‌, మదర్ డెయిరీ పాల ధరలు

న్యూఢిల్లీ: డెయిరీ సంస్థలు అముల్, మదర్ డెయిరీ తమ పాల ధరలను లీటరుకు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించాయి. కొత్త ధరలు గురువారం నుంచే అమలులోకి వస్తాయి. ఉత్పత్తి, నిర్వహణ ఖర్చులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపాయి. పశుగ్రాసం, ప్యాకేజింగ్, ఇంధన ఖర్చులు భారీగా పెరగడమే ఈ ధరల పెంపునకు ప్రధాన కారణమని సంస్థలు పేర్కొన్నాయి. అముల్ తాను సంపాదిస్తున్న ప్రతి రూపాయిలో దాదాపు 80 పైసలు, మదర్ డెయిరీ పాల ఆదాయంలో 75-–80 శాతం నేరుగా రైతులకు అందజేస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో అముల్ బ్రాండ్ టర్నోవర్ రూ. లక్ష కోట్ల మైలురాయిని దాటింది. అమూల్‌ అన్ని రకాల పాల ప్యాకెట్లపై ధర పెంచింది. ఢిల్లీ- ఎన్‌‌సీఆర్‌‌‌‌లో 500ఎల్‌‌ అముల్ గోల్డ్ రూ.36, తాజా రూ.30, ఆవు పాలు రూ.31కి చేరాయి. గేదె పాల ధర లీటరుకు రూ.4 పెరిగి రూ.80కి చేరుకుంది.


V6 News 1 hour ago
Home Flash News