Select Location
All Locations
State
Region
City / District
కెప్టెన్గా తిలక్‌‌‌‌‌‌‌‌ వర్మ.. ఇండియా– ఎ జట్టులో వైభవ్‌‌‌‌‌‌‌‌ సూర్యవంశీ

కెప్టెన్గా తిలక్‌‌‌‌‌‌‌‌ వర్మ.. ఇండియా– ఎ జట్టులో వైభవ్‌‌‌‌‌‌‌‌ సూర్యవంశీ

న్యూఢిల్లీ: శ్రీలంక వేదికగా జరిగే ముక్కోణపు వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌ కోసం ఇండియా–ఎ జట్టును సెలెక్టర్లు గురువారం ప్రకటించారు. మొత్తం 15 మందితో కూడిన టీమ్‌‌‌‌‌‌‌‌కు తిలక్‌‌‌‌‌‌‌‌ వర్మ కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించనున్నాడు. వండర్‌‌‌‌‌‌‌‌ కిడ్‌‌‌‌‌‌‌‌ వైభవ్‌‌‌‌‌‌‌‌ సూర్యవంశీకి జట్టులో చోటు కల్పించారు. వచ్చే నెల 26 నుంచి ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌, ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌లో సీనియర్‌‌‌‌‌‌‌‌ టీమిండియా పర్యటించనుంది. ఈ నేపథ్యంలో వైభవ్‌‌‌‌‌‌‌‌ సత్తాను పరీక్షించాలని సెలెక్టర్లు భావించారు. అందుకే అతనికి ఇండియా–ఎ జట్టులో ప్లేస్‌‌‌‌‌‌‌‌ కల్పించినట్లు తెలుస్తోంది.

అలాగే ఈ టోర్నీ కోసం ఎంపిక చేసిన ప్లేయర్ల సగటు వయసు 23 ఏళ్లుగా ఉండటం విశేషం. బౌలర్లు అర్షద్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌, యుధ్వీర్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌, యష్‌‌‌‌‌‌‌‌ ఠాకూర్‌‌‌‌‌‌‌‌ మినహా మిగిలిన ప్లేయర్లంతా 25 ఏళ్ల లోపు వారే. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌, విజయ్‌‌‌‌‌‌‌‌ హజారే ట్రోఫీలో రాణించిన వారికి ఈ జట్టులో ప్రాధాన్యత కల్పించారు. రియాన్‌‌‌‌‌‌‌‌ పరాగ్‌‌‌‌‌‌‌‌కు వైస్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్సీ అప్పగించారు. ఇక ముక్కోణపు సిరీస్‌‌‌‌‌‌‌‌లో ఇండియా–ఎతో పాటు శ్రీలంక, అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌ జట్లు పాల్గొంటాయి. జూన్‌‌‌‌‌‌‌‌ 9, 15న శ్రీలంకతో.. 11, 17న అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌తో ఇండియా మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు ఆడనుంది. జూన్‌‌‌‌‌‌‌‌ 21 ఫైనల్‌‌‌‌‌‌‌‌ జరగనుంది. దంబుల్లా వేదికగా మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు జరుగుతాయి.

ఇండియా-ఎ జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్), రియాన్ పరాగ్ (వైస్ కెప్టెన్), ప్రియాన్ష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ బదోని, నిషాంత్ సింధు, హర్ష్ దూబే, సూర్యాన్ష్ షెడ్జ్, ప్రభ్‌‌‌‌‌‌‌‌సిమ్రాన్ సింగ్ (కీపర్), కుమార్ కుశాగ్ర (కీపర్), విప్రజ్ నిగమ్, యశ్ ఠాకూర్, యుధ్వీర్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్.


V6 News 36 minutes ago
Home Flash News